Vincy aloshious Video: నా ముందే డ్రెస్ మార్చుకోమ్మని హీరో టార్చర్..!.. షాకింగ్ నిజం బైటపెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్..

Vincy aloshious latest comments: మలయాళ నటి విన్సీ సోనీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక హీరో తనను షూటింగ్ సమయంలో డ్రెస్ మార్చుకొవడానికి వెళ్తుంటే తన ముందే మార్చుకొవాలని హీరో ఒత్తిడి చేశాడని కూడా చెప్పింది. అదే విధంగా తనకు ఎదురైన వేధింపులపై ఒక వీడియోను సైతం విడుదల చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2025, 02:15 PM IST
  • మలయాళ నటికి వేధింపులు..
  • వైరల్గా మారిన వీడియో..
Vincy aloshious Video: నా ముందే డ్రెస్ మార్చుకోమ్మని హీరో టార్చర్..!.. షాకింగ్ నిజం బైటపెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్..

Malayalam Actress Vincy aloshious comments on harassment:  సినిమా ఇండస్ట్రీలో వేధింపుల ఘటన తరచుగా వార్తలలో ఉంటుంది. ఈ క్రమంలో కొంత మంది సెలబ్రీటీలు తమకు సినిమాల్లో చాన్సు ల కోసం కమిట్ మెంట్ అడిగారని గతంలో చాలా మంది నిజాలు బైటపెట్టారు. మరికొంతమంది తమను వేధించిన వాళ్లపేర్లను సైతం బహిరంగంగానే చెప్పుకున్నారు.

Add Zee News as a Preferred Source

 కొన్నిసార్లు అసలు.. హీరోలు, నిర్మాతలు తమతో బెడ్ షేర్ చేసుకుంటేనే సినిమాలో అవకాశాలు ఇస్తామని వేధించారని హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్ లపై షాకింగ్ విషయాలను కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మలయాళ నటి విన్సీ సోనీ తనకు గతంలో కల్గిన ఒక షాకింగ్ అనుభవంపై ఏకంగా ఒక వీడియోను రిలీజ్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

 

మళయాళ ఇండస్ట్రీ భామ నటి విన్సీ సోనీ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో  షూటింగ్ లో ఒక హీరో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తనకు కల్గిన చేదు అనుభవం గురించి అభిమానులతో తన బాధను చెప్పుకున్నారు. అంతేకాకుండా.. ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని కూడా చెప్పుకొచ్చారు.  ఆయన గతంలో.. డ్రగ్స్ తీసుకున్నప్పుడు.. షూటింగ్ లో వేసుకున్న డ్రస్ మార్చుకొవడానికి వెళ్తుండగా.. తన ముందే మార్చుకొవాలని కూడా ఇబ్బంది పెట్టినట్లు విన్సీ సోనీ తన వేధింపుల ఘటనను బైటకు చెప్పుకున్నారు.

ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మంది ఫిమేల్ ఆర్టిస్టులు వేధింపులకు గురౌతున్నారని కూడా బాధపడ్డారు. అసలు.. ఇప్పటికి కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుని నీచంగా ప్రవర్తిస్తున్నారని నటి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎదురైన వేధింపుల ఘటన అందరికి తెలిసిన కూడా... దీనిపైన ఎవరు మాట్లాడలేదని నటి ఎమోషనల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మళయాళ నటి విన్సీ సోనీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Read more: Vijaya Shanthi: అన్న లెజినోవా గుండుపై భీభత్సంగా ట్రోల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి !

 హీరోయిన్ లు ఇటీవల కాలంలో ఎక్కువగా  వేదింపులకు గురౌతున్నారని కూడా నటి విన్సీ సోనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా..  2019 లో విన్సీ సోనీ మళయాల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే విధంగా.. రేఖ మూవీతో కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది.  ఆమె నటించిన జనగణన చిత్రం అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News