MSVPG OTT: OTT మన శంకరవరప్రసాద్ గారు స్ట్రీమింగ్.. ఎక్కడంటే..!

Mana Shankar Vara Prasad Garu OTT Details  చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా.. జనవరి 12 విడుదలైన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఒక వార్త బయటకొచ్చింది..

Written by - Vishnupriya | Last Updated : Jan 12, 2026, 06:50 PM IST
MSVPG OTT: OTT మన శంకరవరప్రసాద్ గారు స్ట్రీమింగ్.. ఎక్కడంటే..!

Mana Shankar Vara Prasad Garu OTT:  మెగాస్టార్ చిరంజీవి హీరోగా..దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చేలా ఈ సినిమాను రూపొందించారు.

Add Zee News as a Preferred Source

ఈ చిత్రం నిన్న ప్రీమియర్స్‌తో విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్..ఆయన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి. అనిల్ రావిపూడి స్టైల్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పూర్తిగా కనిపిస్తోంది. ప్రతి వయసు ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా కథ, సన్నివేశాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Zee5 దక్కించుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను Zee Telugu సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో సినిమా తన రన్ పూర్తి చేసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ముఖ్యంగా నాలుగు వారాలు తర్వాత ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి అగ్రీమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో విడుదలైతే మరింత పెద్ద ప్రేక్షక లోకాన్ని ఈ సినిమా చేరుకునే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కావడంతో టీవీ ప్రీమియర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రంలో కథ చాలా సింపుల్‌గా ఉండడం మరో ప్లస్ పాయింట్. కుటుంబ విలువలు, నవ్వులు, భావోద్వేగాలు కలగలిపి అనిల్ రావిపూడి సినిమాను నడిపించారు. సంగీతం కూడా సినిమాకు బాగా సహకరిస్తోంది.

Read more: Bhogi Festival date 2026: భోగి వేడుక ఎప్పుడు..?.. చిన్నారులకు భోగి పండ్లు పోస్తున్నారా..?.. ఈ పొరపాట్లు చేయోద్దు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News