Manam Saitam: హైద‌రాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం..మనం సైతం కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..!

Manam Saitam Kadambari Foundation: హైద‌రాబాద్‌లో 'మనం సైతం కాదంబరి ఫౌండేషన్' వారు ఎంతోమందికి.. ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వందలాది మంది పాల్గొని వైద్య సేవలను పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Written by - Vishnupriya | Last Updated : Mar 31, 2025, 11:02 AM IST
Manam Saitam: హైద‌రాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం..మనం సైతం కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..!

Free Mega Medical Camp: హైద‌రాబాద్‌లో 'మనం సైతం కాదంబరి ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ష్యూర్ ఆడియో టెక్నాలజీస్ సంస్థ వారి CSR సౌజన్యంతో ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిటల్ విద్యాన‌గ‌ర్ వారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.  

Add Zee News as a Preferred Source

ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని తమ ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ఇందులో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, "ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద ఏదీ లేదు. అందుకే ఈ పండగ రోజున మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాం" అని తెలిపారు.  

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆశీస్సులతో శ్రీకారం చుట్టామని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో 50 వేల మంది నిరుపేదలకు తమ ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. అనాధ, వృద్ధాప్య ఆశ్రమాలను ప్రారంభించి మరింత సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.  

నటుడు వినోద్ బాలా మాట్లాడుతూ, "కాదంబరి కిరణ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సేవల్లో మేమూ భాగస్వాములు కావడం గర్వంగా ఉంది" అని చెప్పారు. సినీ నటుడు కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, "మనంసైతం సేవా యజ్ఞంలో మేము కూడా నిరంతరం పాల్గొంటాం" అని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ఎల్ఐజీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సినీ కార్మికులు, పలువురు ప్రముఖులు పాల్గొని 'మనం సైతం కాదంబరి ఫౌండేషన్' చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఇదీ చదవండి : Earthquake: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవిస్తుంది? దాని వినాశనం ఎలా ఉంటుంది తెలుసా?

ఇదీ చదవండి : Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే వేసవిసెలవులు ప్రారంభం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News