Manchu Family Dispute: మంచు కుటుంబంలో తీవ్రస్థాయిలో విభేదాలు ఏర్పడ్డ పరిస్థితుల్లో హీరో మంచు మనోజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే కుంటుతూ ఆస్పత్రికి వెళ్లి మనోజ్‌ చికిత్స పొందాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. మెడకు పట్టితో కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేయగా.. పరీక్షల్లో మనోజ్‌కు మరికొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. శరీరంలో కొన్ని భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని మెడికల్‌ రిపోర్ట్‌ చెబుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Abhishek Bachchan: 51 ఏళ్ల వయసులో ఐశ్వర్య రాయ్ ప్రెగ్నన్సీ? అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు వైరల్


నివేదికలో ఇదే!
జల్‌పల్లిలోని ఫామ్ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు వైద్య రిపోర్ట్‌లో ఉంది. 8వ తేదీ ఆదివారం ఉదయం 9.30 సమయంలో దుండగులు దాడి చేశారు. మెడపై.. కుడి భుజం.. తొడ భాగంలో గాయాలయ్యాయని రిపోర్ట్‌ చెబుతోంది. పలు శరీర భాగాల్లో ఫ్రాక్చర్‌ అయినట్లు వైద్య నివేదికలో ఉంది. దీని కారణంగానే మనోజ్‌ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే మెడకు పట్టితో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Jani Master: ప్రతిభను ఎవరూ తొక్కలేరు.. అసత్య వార్తలపై జానీ మాస్టర్‌ ఆగ్రహం


మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం పోలీస్‌స్టేషన్‌ వరకు చేరింది. పహడీ షరీఫ్‌ పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌తోపాటు మంచు కుటుంబం నుంచి కొందరు వచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తనపై దాడికి పాల్పడిన వారిపై మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గుర్తు తెలియని వ్యక్తుల అని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


కాగా మంచు కుటుంబంతో జరుగుతున్న వివాదంలో హైదరాబాద్‌లో పేరుగాంచిన రౌడీ షీటర్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. కుటుంబంలో వివాదాలపై సూపర్‌స్టార్‌ రజినీకాంత్ కూడా ప్రవేశించారని తెలుస్తోంది. 'మంచి కుటుంబంలో వివాదం పరిష్కరించండి' అంటూ ఫోన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. 'మోహన్ బాబుతో మాట్లాడుతున్నా. సెట్ చేస్తా' అంటూ రజినీకాంత్‌కు చిన్న శ్రీశైలం యాదవ్‌ వివరణ ఇచ్చినట్లు సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.