Manchu Lakshmi Video: మనోజ్‌ను చూసి అందుకే ఏడ్చాశా..!.. ఎమోషనల్ వార్తలపై ఓపెన్ అయిన మంచు లక్ష్మి..!.. వీడియో వైరల్..

Manchu Lakshmi Emotional Video: మంచు లక్ష్మి ఇటీవల ఒక కార్యక్రమంలో తన తమ్ముడు మంచు మనోజ్ ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. దీనిపై తాజాగా.. మంచు లక్ష్మి తన దగ్గరి స్నేహితులతో అసలు విషయంను పంచుకున్నట్లు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 15, 2025, 11:01 AM IST
  • మంచు ఇంట వివాదం..
  • ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి..
Manchu Lakshmi Video: మనోజ్‌ను చూసి అందుకే ఏడ్చాశా..!.. ఎమోషనల్ వార్తలపై ఓపెన్ అయిన మంచు లక్ష్మి..!.. వీడియో వైరల్..

Manchu Lakshmi gets emotional after sudden entry of Manchu manoj Video: మంచు ఇంట వివాదాలు ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు,రాజకీయంగా కూడా హట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో ఇటీవల మంచు మనోజ్ మరల జల్ పల్లి దగ్గర చేరుకుని తనను ఇంట్లోకి రానీయడంలేదని కూడా నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో మరోసారి మంచు వారింట పంచాయతీ వార్తలలో నిలిచింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన తండ్రి, అన్నపై షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. చిన్నప్పటి నుంచి తనకుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పుకొచ్చాడు.

Add Zee News as a Preferred Source

అయిన తన తండ్రి తన మీద ప్రేమలో వ్యత్యాసం చూపిస్తాడని కూడా చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో విష్ణు తన ఇంట్లోకి ప్రవేశించి.. తన కాస్లీ వస్తువుల్ని, కార్లను చోరీ చేశాడని జల్ పల్లి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మరోసారి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా... మంచు లక్ష్మి హైదరాబాద్ లో  టీచ్ ఫర్ ఛేంజ్ సేవా కార్యక్రమం.. నిర్వహించింది. దీనిలో సెలబ్రీటీలతో ఫ్యాషన్ షోలను నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంతో వచ్చిన ఫండ్ ను మంచు లక్ష్మి వివిధ సేవా కార్యక్రమాల్లో ఉపయోగించనున్నారు. అయితే.. తాజాగా.. మంచు మనోజ్, మౌనిక లు కూడా ఈ ప్రొగ్రామ్ కు వచ్చారు. అప్పుడు.. మంచు లక్ష్మి వీరిని ఒక్కసారిగా చూసి ఎమోషనల్ అయ్యింది. స్టేజీ మీదనే కూర్చుండిపోయి ఏడ్చేసింది. దీంతో మంచు మనోజ్ దంపతులు సైతం తమ అక్కమంచు లక్ష్మిని ఓదార్చారు.ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా  మారింది.

దీనిపై చాలా మంది మంచు లక్ష్మికి ప్రత్యేకంగా ఫోన్ లు, వాట్సాప్ లు , సోషల్ మీడియాల వేదికగా ప్రశ్నలు వేశారంట. అయితే.. దీనిపై మంచు లక్ష్మి తన సన్నిహితులతో కొన్ని విషయాలను మాట్లాడారంట. ఇటీవల చోటు చేసుకుంటున్న తన ఇంట్లోని వివాదాలపైన మాట్లాడారంట.

Read more: Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..

ఆ సాయి నాథుడు తమ ఇంట్లోని గొడవలకు ఒక పరిష్కారం చూపించాలని కోరుకుందంట. అందుకే ఒక్కసారిగా.. మంచు మనోజ్ ను చూడగానే పట్టలేని విధంగా కన్నీళ్లు వచ్చాయని మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. మరోవైపు  తన భార్యను వివాదంలో ఇరికించడం.. తన భార్య పేరు సైతం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని కూడా మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News