Manchu manoj in bhairavam triler launch event video: మంచు మనోజ్, విష్ణుల వివాదం మరోసారి వార్తలలో నిలిచింది. ఆయన ఇటీవల భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ లో మాట్లాడిన మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో.. విజయ్ కనకమేడల బైరవం మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఈ క్రమంలో. ఆదివారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Manchu Manoj pic.twitter.com/NPf1AcaYJL
— Absolute KCPD (@AbsoluteKCPD) May 18, 2025
ఈ నేపథ్యంలో భైరవం మూవీ టీమ్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. తొమ్మిదెళ్లు గ్యాప్ వచ్చిన కూడా తనను ఆదరించారన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన కుటుంబం వివాదం తెరమీదకు వచ్చిందన్నారు. తాను ఇంట్లోలేనప్పుడు తన కారులు చోరీ చేశారన్నారు. శివయ్య అభిమానుల రూపంలో వచ్చి.. 20 కార్లు తన ఇంటి ముందు పెట్టి మేమున్నామని అండగా ఉన్నారని ఎమోషనల్ అయ్యాడు.
తన అభిమానులు తనకు శివయ్య రూపంలో ప్రతి విషయంలోను అండగా నిలిచారన్నారు. నా ఫ్యామిలీకి తనకున్న నిజమైన కుటుంబం.. తన అభిమానులు అని చెప్పుకొచ్చారు. నా మీద నమ్మకంతో 50 వేల కోట్లు నిర్మాత ఖర్చుపెట్టారన్నారు. ఆయన రుణం ఎన్ని జన్మలు ఎత్తిన తీర్చుకోలేనని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. నా కుటుంబం తన మీద పెట్టిన కేసులు చేస్తున్న ఆరోపణలు తనకు బాధగా లేదని అన్నారు.
కానీ అదే నా బలహీనతో.. వాళ్ల బలమో అర్థం కావట్లేదన్నారు. ఎన్ని జన్మలెత్తిన నా అభిమానులే తనకు తల్లిదండ్రులని కూడా మాట్లాడాడు. అంతేకాకుండా.. ఈ జన్మకు చివరి కట్టె కాలే వరకు తన తండ్రి మోహన్ బాబు తన తండ్రి అని మాట్లాడాడు.
ఆయన చిన్నప్పటి నుంచి తనకు న్యాయం, ధర్మం నూరిపోశాడని.. అవి వింటూ పెరిగినట్లు చెప్పారు. ఈరోజున ధర్మంవైపున ఉంటే.. తనపై ఆరోపణలు, కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో..మే 30న రాబోతోన్నన భైరవం సినిమా.. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని మంచు మనోజ్ మాట్లాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









