Manchu manoj emotional comments on mohan babu in bhairavam movie promotion: మంచు ఇంట మంటలు ఇప్పట్లో చల్లారేలా కన్పించడంలేదు. మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణులు ఏ ఒక్కరు కూడా తగ్గకుండా.. ఒకరిపై మరోకరు పంచ్ లు వేసుకుంటునే ఉన్నారు. ఇటీవల మంచుమనోజ్ తన భైరవం మూవీ ప్రమోషన్లలో భాగంగా... విష్ణు మూవీ కన్నప్పపై సెటైర్ లు వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా మంచు విష్ణు సైతం.. నా వాల్లే తన పతనం కోరుతున్నారని, కానీ హీరో ప్రభాస్ మాత్రం తనకు అన్నివిధాలుగా అండగా నిలిచాడని మాట్లాడారు. అదే విధంగా.. ఇండైరెక్ట్ గా... మంచు మనోజ్ ను టార్గెట్ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా.. మంచు మనోజ్ ఒక ఇంటర్వ్యూలో.. తన తండ్రి మోహన్ బాబును.. గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తాను గత కొన్ని నెలలుగా ఇంట్లో వాళ్ల ప్రేమకు దూరమయ్యానని ఎమోషనల్ అయ్యారు. అమ్మతో మాట్లాడాలంటే కండీషన్ లు పెట్టారని చెప్పుకొచ్చాడు. నా కూతురంటే అమ్మకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. తన తండ్రి.. మోహన్ బాబు..తన కూతుర్ని ఎత్తుకుని ముద్దాడుతుంటే చూడాలని ఉందని చెప్పాడు.
నా పోరాటం, ఆస్తి కోసం కాదని మనోజ్ మళ్లీ స్పష్టం చేశాడు. తన ఉనికిని కాపాడుకునేందుకు అని క్లారిటీ ఇచ్చాడు. నాపై నా అనుకున్న వాళ్లే కత్తులు దూస్తున్నారని.. నా ముందు ఒక కత్తి ఉంది.. నా ప్రాణం కాదు.. నా భార్య, పిల్లల కోసం పొరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ తాను తప్పుచేసిఉంటే.. సారీ చెప్పేవాడని.. కానీ తన తండ్రి.. తప్పు చేయందే తలవంచొద్దని విలువలు చెప్పి నేర్చించారని ఎమోషన్ అయ్యాడు.
Read more; Tirumala NRIS: ఎన్నారై భక్తులకు భారీ గుడ్ న్యూస్.. టీటీడీ మరో సంచలన నిర్ణయం.. ఏమిటంటే..?
అందుకే ఈ రోజు నా వాళ్లతోనే నేను యుద్దం చేస్తున్నట్లు చెప్పాడు. అయిన వాళ్ల మీద నాకు కోపం రావట్లేదని కూడా మంచు మనోజ్ భావొద్వేగంతో మాట్లాడారు. ఈ క్రమంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటించిన భైరవం మూవీ మేనెల 30న విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









