Manchu Manoj: మంచు ఇంట మళ్లీ రచ్చ.. ఇంట్లో చోరీ చేశాడని అన్నపై మంచు మనోజ్ ఫిర్యాదు..

Manoj VS Vishnu: మంచు ఇంట మళ్లీ వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన అన్న, మరికొందరు తన ఇంట్లో అక్రమంగా ప్రవేశించి కాస్లీ వస్తువుల్ని చోరీ చేశాడని పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు.ఈ ఘటనతో మరోసారి మంచు ఇంట లొల్లి వార్తలలో నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2025, 07:01 PM IST
  • మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ..
  • అన్నపై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్..
Manchu Manoj: మంచు ఇంట మళ్లీ రచ్చ.. ఇంట్లో చోరీ చేశాడని అన్నపై మంచు మనోజ్ ఫిర్యాదు..

Manchu family dispute: మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కన్పించడంలేదు. ఏమాత్రం కూల్ అయ్యిందో అనుకునే సరికి.. ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో మంచు ఫ్యామిలీ  వార్తలలో ఉంటున్నారు.  ఇక తాజాగా.. మంచు మనోజ్ మరోసారి నార్సింగీలోని పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు, తన ఇంట్లోని కాస్లీ వస్తువులను తన అన్నమంచు విష్ణు దొంగిలించాడని నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు  చేశాడు.

Add Zee News as a Preferred Source

జల్ పల్లిలో  ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని తన ఫిర్యాదులో పేర్కాన్నాడు. తన ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు, విష్ణుఆఫీసులో దొరికాయని చెప్పాడు. కొంత మంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

కొన్ని వస్తువులను పగలకొట్టి ధ్వంసం కూడా చేశారని కూడా పోలీసులకు చెప్పాడు.  తన కూతురు బర్త్ డే  కొరకు నేను  రాజస్థాన్ కి వెళ్లగా నా సోదరుడు నా ఇల్లుని ధ్వంసం చేశాడని మంచు మనోజ్ పోలీసుల ఎదుట వాపోయాడు. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. మంచు విష్ణుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మంచుమనోజ్ నార్సింగీ పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశాడు.ఈ క్రమంలో మరోసారి మంచుఫ్యామిలీ రచ్చ వార్తలలో నిలిచింది.

మంచు మోహన్ బాబు ఇంట వివాదాలు గతేడాది చివరి నుంచి నడుస్తునే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు..మంచు మనోజ్ తన అన్నపై, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. దీనిపై పోలీసులుకూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి న్యూసెన్స్ లు చేయోద్దని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. కూర్చుని కుటుంబ సమస్యలు పరిష్కరించుకొవాలని హితవు పలికారు. కొన్నిరోజులుగా సర్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో మరోసారి మంచు మనోజ్ , తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం మరోసారి మంచు ఇంట గొడవలు వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News