Manchu manoj on comments on Manchu vishnu: మంచు ఇంట వివాదం ప్రస్తుతం సమ్మర్ లో మరింత హీట్ ఎక్కింది. ఈ క్రమంలో ఇటీవల మంచు మనోజ్ మరల జల్ పల్లిలోకి తన ఇంటి ముందు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తనను లోపలికి రానీయకుండా గేట్స్ క్లోజ్ చేశారని లోపల తన ఇంట్లో కాస్లీ వస్తువులు, పెంపుడు శునకాలు ఉన్నాయన్నారు. తన కూతురు బర్త్ డే కోసం రాజస్థాన్ వెళ్లి వచ్చే వరకు విష్ణు కిరాయి గుండాలతో తన ఇంట్లోకి ప్రవేశించి కాస్లీ వస్తువులు,కార్లను ఎత్తుకుని పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ తగాదాల గురించి చాలా ఎమోషన్ గా మాట్లాడారు. గత రెండేళ్లుగా తన ఇంట్లో గొడవలు జరుగతున్నాయన్నాడు. అంతేకాకుండా.. తన అన్న విష్ణు పలు మార్లు తనపై దాడికి దిగాడని చెప్పుకొని బాధపడ్డారు. ఇప్పటి వరకు తన మీద 30 కేసులు పెట్టించారన్నారు. తన భార్య, పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికించారన్నారు. అసలు.. తనకు ఈ విషయంతో ఎలాంటి సంబంధంలేదన్నారు. తన భార్య పేరును ఎఫ్ ఐ ఆర్ లో పెట్టడంతో చాలా బాధపడ్డానని అన్నారు.
తన భార్య చెప్పినట్లు నేను చేస్తున్నానని.. ఆస్తి కోసం ఇలా డ్రామాలు ఆడుతున్నానని లేని పుకార్లు వైరల్ చేశారన్నారు. ఇప్పటికి కూడా ఆస్తుల కోసం తాను ఈ విధంగా చేయడంలేదన్నారు. తన భార్యను లేని గొడవల్లో ఇరికించారని మనోజ్ చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా.. తన జుట్టు తన అన్న చేతిలో పెట్టేందుకు ఇదంతా డ్రామాలు ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. కన్నప్పను కూడా కావాలని వాయిదా వేశారన్నారు.
అదే విధంగా సన్నాఫ్ ఇండియాలొ ఒక పాట గ్రాఫిక్స్ కోసం కోటి రూపాయలు ఖర్చుచేశారన్నారు. తన జీవితంలో చాలా సందర్భాలలో తన కుటుంబం కోసం త్యాగంచేశానని చెప్పుకొచ్చారు. తను ఎలాంటి తప్పుచేయలేదని, ఆస్తి కోసం మాత్రం తన గొడవ కాదని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుతో ఈ విషయంపై మాట్లాడేందుకు చాలా ప్రయత్నించానని కానీ..ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. ఇక దీనిపై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని.. ఎంతదూరమైన వెళ్తానని మంచు మనోజ్ స్పష్టం చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









