Manchu family Manoj vs Manchu vishnu controversy: మంచు మోహన్ బాబు ఇంటి రచ్చ మరోసారి వార్తలలో నిలిచింది. మంచు మనోజ్ తాజాగా.. తన కారు, కాస్లీ వస్తువులను తన అన్న మంచు విష్ణు చోరీ చేశాడని.. తన పర్మిషన్ లేకుండా.. దాదాపు.. 150 మంది తన ఇంట్లోకి ప్రవేశించారని కూడా నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు బర్త్ డే కోసం రాజస్థాన్ కు వెళ్లి వచ్చేలోపు ఈ విధంగా తన అన్న తన విలువైన వస్తువులను చోరీ చేశాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే..మంచు మనోజ్ జల్ పల్లిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న సిబ్బంది తమను అనుమతించలేదు. దీంతో మంచు మనోజ్ గేటు ముందే నిరసనకు దిగాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పహాడీ షరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా
జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు
తన కారును తన సోదరుడు మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని.. తనకు ఎక్కడా ఇల్లు లేనందున ఈ… pic.twitter.com/LgyRpnJ5mX
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2025
అంతేకాకుండా.. రెండు కిలీమీటర్ల పరిధిలో ఇతరులు ఎవర్ని పోలీసులు అనుమతించడంలేదు.మొత్తానికి జల్ పల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేటు ముందు కూర్చుని మంచు మనోజ్ నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనతో మంచు ఇంట వివాదం మరోసారి వార్తలలో నిలిచింది. గతేడాది చివరి నుంచి మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు వివాదం వార్తలలో ఉంటుంది.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు, మంచు కుటుంబం పోలీసుల ఎదుట హజరయ్యారు.
గతంలో మంచు మనోజ్ జల్ పల్లి దగ్గర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచు మోహన్ బాబు అనూహ్యంగా ఒకమీడియా ప్రతినిధిపై దాడికి దిగారు. ఈ క్రమంలో మోహన్ బాబు కోపంలో మీడియా ప్రతినిధిపై దాడికి దిగాడు. అయితే.. ఈ కేసుల్లో మోహన్ బాబు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు.ఈ క్రమంలో మరోసారి మంచు మనోజ్ జల్ పల్లి వద్ద నిరసనలు వ్యక్తం చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









