)
Kannappa Hard Disk Update: మంచు ఫ్యామిలీలో.. గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్.. మంచు విష్ణు మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
వీళ్ళిద్దరి మధ్య ఆస్తిపరంగా గొడవలు జరుగుతూ ఉండగా.. అసలు ఈ ఆస్తి గొడవలు వచ్చిందే మంచు విష్ణు కన్నప్ప.. సినిమాపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల అనే వార్తలు కూడా వినిపిచ్చాయి. ఈ క్రమంలో.. ఈ మధ్య కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్.. ఎవరో దొంగతనం చేశారు. అయితే ఆ హార్డ్ డిస్క్.. లో ఏకంగా ప్రభాస్ సీన్స్ ఉన్నాయి.. అని ఆ సీన్స్ మొత్తం ఆన్లైన్ లో పెట్టేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి.. అంటూ కన్నప్ప టీం చెప్పుకొచ్చారు..
ఈ క్రమంలో ఈ హార్డ్ డిస్క్ తీసుకుపోయిన.. ఇద్దరిలో ఒకరి పేరు చరిత అని బయటికి వచ్చింది. అయితే భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో..థాంక్యూ చరిత అని మనోజ్ స్టేజ్ పైన ఆ సినిమా గురించి చెబుతూ చెప్పారు. ఇక దీంతో ఈ చరిత.. హార్డ్ డిస్క్ తీసుకుపోయిన..చరిత ఒకరేనా అని..సందేహం రాగా.. ఈ హార్డ్ డిస్క్ వ్యవహారంలో.. మంచు మనోజ్..హస్తం ఉందా అని ఎన్నో అనుమానాలు రాసాగాయి
ఇక నిన్న విడుదలైన భైరవం పరవాలేదు అనిపించుకుంటూ ఉండగా.. ఈ సినిమా సక్సెస్ మీట్ ఈరోజు ఘనంగా జరిపారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ మనోజ్ ని..” ఆస్తుల గొడవల గురించి వచ్చింది కాబట్టి.. ఒకటి అడుగుతున్నాను కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది.. మీకు సంబంధం ఉంది అనే వార్తలు వస్తున్నాయి,” అనగానే..మనోజ్..” నేను మీకే ఇచ్చాను కదా.. మర్చిపోయారా మీరు మొన్న కలిసినప్పుడు.. ఇచ్చాను కదా,” అని ఫన్నీగా చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత వెంటనే సినిమా చాలా మంది కష్టమని.. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.