manchu vs manchu mohan controversy: మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య వివాదం పీక్స్ కు వెళ్లిపోయిందని తెలుస్తొంది. ఈ రోజు అనేక షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నాయి. మంచు మనోజ్ కు చెందిన సామానులనుకూడా లారీలల్లో బైటకు పంపించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ తన బౌన్సర్ లతో కలిసి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తు జల్ పల్లిలోని తన నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు.
మీడియా పై దాడికి పాల్పడ్డ మోహన్ బాబు pic.twitter.com/jP88QpZFmp
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2024
ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. మోహన్ బాబు బౌన్సర్ లు.. మంచు మనోజ్ లపై దాడులు చేసినట్లు తెలుస్తొంది. అదే విధంగా మంచు మనోజ్ సైతం.. వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవలు ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ముఖ్యంగా మంచు మోహన్ ఆవేశంతో ఊగిపోయి.. విలేకరిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తొంది. దీంతో అక్కడి వారంత నిరసనలు వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జల్ పల్లి దగ్గర పోలీసులు చేరుకుని మోహన్ బాబు గన్ ను సీజ్ చేసినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు ప్రవర్తనను మీడియా వాళ్లు ఖండిస్తున్నారు.మొత్తానికి మోహన్ బాబు, మంచు మనోల మధ్య వివాదం మాత్రం చలికాలంలో హీట్ ను పుట్టిస్తుందని చెప్పుకొవచ్చు. ఈరోజు మంచు మోహన్ ఇంట పనిచేసే పనిమనిషీ సైతం.. వీరి మధ్య ఉన్న గొడవల గురించి చెప్పినట్లు తెలుస్తొంది.
మంచు మనోజ్, ఒక సారి మోహన్ బాబును తోసేసినట్లు చెప్పింది. దీంతో అప్పటి నుంచి మంచు మనోజ్ పై..మంచు విష్ణు మాత్రం కోపంగా ఉంటున్నారంట. మరోవైపు భూమా మౌనికను కూడా పెళ్లి చేసుకొవడం వీరికి అంతగా ఇష్టంలేదని వార్తలు బైటికొచ్చాయి. ఈ క్రమంలో వీరి గొడవ ఇంకా ఏటువైపు వెళ్తుందో అని ప్రస్తుతం ఇండస్ట్రీలో రచ్చ కొనసాగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.