Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ ముందున్న అతిపెద్ద టాస్క్ ఇదే..

Kannappa: మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’.  మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమా ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 25, 2025, 02:31 PM IST
Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ ముందున్న అతిపెద్ద టాస్క్  ఇదే..

Kannappa: ‘కన్నప్ప’ ద్వాపర యుగంలో అర్జునుడిగా మోక్షం రాకుండా.. కలియుగంలో తిన్నడిగా పుట్టాడని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలుగు తెరపై ‘శ్రీకాళహస్తి మహత్మ్యం’, భక్త కన్నప్ప చిత్రాలొచ్చాయి. ఇవి వచ్చి దాదాపు  50 యేళ్లు అవుతున్నాయి. ఇప్పటి జనరేషన్ కు ఈ స్టోరీ చెప్పడానికే మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వస్తోన్నకన్నప్ప స్టోరీపై వస్తోన్న మూడో చిత్రం. ఇప్పటికే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, రెబల్ స్టార్  కృష్ణంరాజు పోషించిన పాత్రలో మంచు విష్ణు చేస్తున్నాడు. దీంతో ఆయా పాత్రలతో పోలిక ఉంటుంది. భారీ బడ్జెట్ తో పాటు అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మంచు విష్ణు కెరీర్ లో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు మంచు విష్ణు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అయిపోయాయి. ప్రభాస్ పాత్ర  సినిమాలో అరగంటకు పైగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభాస్ నటించడనే ఈ సినిమాపై హైప్స్ నెలకొన్నాయి. ప్రభాస్ ఫేస్ తోనే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో బిజినెస్ జరగుతోంది. 

Add Zee News as a Preferred Source

ఈ సినిమా ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ చిత్రం 3 గంటల 15 నిమిషాలున్నాయి. అది గనుక నిజమైతే.. ఆడియన్స్ ను అంతసేపు కూర్చొబెట్టే కంటెంట్ సినిమాలో ఉండాలి. ఆల్రెడీ ప్రేక్షకులకు తెలిసిన ఈ కంటెంట్  ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటేనే ఈ సినిమా సేఫ్ అవుతుంది.అంతేకాదు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావాలి. 

ఇక విదేశాల్లో కన్న్ప టికెట్ ధర 24 డాలర్ల దాకా ఉందట. అది అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా టికెట్ రేట్స్ పెంచకుండా అతి తక్కువ రేట్లతో రిలీజ్ చేయడంతో పాటు పాజిటివ్ టాక్ కూడా దోహదం చేయాలి. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను రప్పించే అంశాల్లో ముఖ్యమైనది ప్రభాస్ అప్పీరియన్స్ అని పబ్లిక్ చెప్పుకుంటున్నారు. ఇక మంచు విష్ణుకు ప్రెజెంట్ పెద్దగా మార్కెట్ లేదు. అందుకే ప్యాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తో ఆడియన్స్  ముందుకు రాబోతున్నారు. సూపర్ స్టార్ అక్షయ కుమార్ ఈ  చిత్రంలో మహా శివుడిగా కనిపించనున్నారు.  ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ లో కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే ట్రైలర్ లో కూడా ప్రభాస్ క్యారెక్టర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ‘కిరాతక’ క్యారెక్టర్ ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు.  

ముఖ్యంగా ‘కన్నప్ప’  సినిమాలో పోరాట దృశ్యాలు, క్లైమాక్స్, సీన్స్, ఎమోషన్స్, భక్తి అంశాలతో పాటు, అక్షయ్ కుమార్, ప్రభాస్ పాత్రలు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంపైనే కన్నప్ప విజయం ఆధారపడి ఉంది. మరి కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. 

Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !

Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News