)
Kannappa OTT Streaming Date : డైనమిక్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ చారిత్రక చిత్రం ఇక సెప్టెంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. ‘కన్నప్ప’ చిత్రం విష్ణు మంచు కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో తిన్నడు పాత్రలో ఓ గిరిజన యోధుడిగా ఆయన పోషించిన క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకున్నా.. మంచి వసూళ్లను రాబట్టినా.. పెట్టిన పెట్టుబడికి కమర్షియల్ గా థియేట్రికల్ గా అంతగా విజయవంతం కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కానీ నాన్ థియేట్రికల్ గా శాటిలైట్, డిజిటల్ రూపంలో ఈ సినిమాకు మంచి రేటుకు అమ్ముడు పోయింది. దీంతో మంచు విష్ణుకు మంచి లాభాలే వచ్చాయి. ఈ చిత్రంతో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ నటుడిగా పరిచయం కావడం విశేషం. అటు మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ఓ పాటలో పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్.. రుద్ర క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. అటు అక్షయ్ కుమార్ శివయ్యగ యాక్ట్ చేస్తే.. కాజల్ అగర్వాల్ పార్వతి మాత పాత్రలో నటించింది. మోహన్ లాల్ కిరాతకుడిగా శివుడి పాత్రలో నటించారు. మంచు విష్ణు .. ఓ సన్నివేశంలో అర్జునుడి పాత్రలో నటించారు. మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో నటించారు.
ఈ చిత్రాన్ని స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ‘శివా శివా శంకరా’ అనే పాట పాపులర్ గా నిలిచింది. ‘కన్నప్ప’ చిత్రం తిన్నడు అనే గిరిజన యోధుడి ఆకర్షణీయమైన కథను చూపిస్తుంది.గతంలో రాజ్ కుమార్, కృష్ణంరాజు పోషించిన పాత్రను మంచు విష్ణు తన శక్తి మేర నటించారు. ఈ చిత్రంలో విశ్వాసం, పరివర్తన, అంతర్గత బలానికి సంబంధించిన కాలాతీత కథగా ప్రతిధ్వనించేలా తెరకెక్కించారు. . ఇక సెప్టెంబర్ 4 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.