)
Kannappa World Television Premier:డైనమిక్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే థియేట్రికల్ గా, ఓటీటీ వేదికగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం తెరపై కనువిందు చేశారు. ‘కన్నప్ప’చిత్రం థియేట్రికల్ విజయం తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ప్రేక్షకులు, మీడియా, సోషల్ మీడియా నుంచి ‘కన్నప్ప’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో కన్నప్ప చిత్రం రిలీజ్ అయిన తరువాత కూడా టాప్‌లో ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
దీపావళి సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రాన్ని జెమినీ టీవీలో అక్టోబర్ 19న ఆదివారం రాత్రి ప్రీమియర్‌గా ప్రదర్శించబోతోన్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ‘కన్నప్ప’ సినిమాను ప్రదర్శించనున్నట్టు అధికారికంగా తెలిపారు. ఇక సన్ నెట్వర్క్ లో 8 ఏళ్ల తరువాత నాలుగు భాషల్లో ఓ సినిమాని ఒకే సారి స్ట్రీమింగ్ చేయడం ఇదే తొలిసారి. ‘కన్నప్ప’ చిత్రంతో ఈ పండుగను మరింత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా స్ట్రీమింగ్‌ను ప్లాన్ చేసినట్టు తెలిపారు. ‘కన్నప్ప’ చిత్రం మెజారిటీ భాగాన్ని న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ప్రభు దేవా నృత్యాలు సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌ను మెప్పించింది.
కన్నప్ప చిత్రంతో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. అటు మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ఓ పాటలో కనిపించి కనువిందు చేయడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్.. రుద్ర క్యారెక్టర్ లో ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. అటు అక్షయ్ కుమార్ శివయ్యగా ఒదిగిపోయారు. కాజల్ అగర్వాల్ జ్ఞానప్రసూనాంబ పాత్రలో నటించింది. మోహన్ లాల్ కిరాతకుడిగా శివుడి పాత్రలో కనువిందు చేశారు. మంచు విష్ణు .. ఓ సన్నివేశంలో అర్జునుడి పాత్రలో కనిపంచారు. మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో జీవించారు. థియేట్రికల్ గా, ఓటీటీ వేదికగా సూపర్ హిట్టైన ఈ చిత్రం ఓటీటీ వేదికగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.