Kannappa: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయాన్ని సందర్శించిన విష్ణు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచు వారబ్బాయి..

Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ల్ యాక్ట్ చేస్తోన్న భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. తాజాగా మంచు విష్ణు.. కన్నప్ప సొంత గ్రామంలో ఆయన పూజలు చేసిన శివాలయాన్ని సందర్శించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 16, 2025, 07:50 AM IST
Kannappa: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయాన్ని సందర్శించిన  విష్ణు..  ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచు వారబ్బాయి..

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈయన కెరీర్ లో అత్యంత భారీ తారాగణంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.  తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు టీజర్‌లు, పాటలు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని విష్ణు మంచు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న మంచు విష్ణు. మరోవైపు కన్నప్పకు సంబంధించిన సొంతూరు వెళ్లారు.

Add Zee News as a Preferred Source

అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లారు. గ్రామస్థులు, ఆలయ సిబ్బంది విష్ణు మంచుకి, కన్నప్ప టీంకు సాదరంగంగా స్వాగతం పలికారు. అక్కడ కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అభివృద్ది చేస్తానని కూడా విష్ణు మంచు హామీ కూడా ఇచ్చారు.

కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్లో యాక్ట్ చేశారు. ఇతర ముఖ్యపాత్రల్లో  మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ అందించిన పాటలు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు శ్రోతల్ని అలరించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమా సక్సస్  అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News