Manyam Dheerudu OTT Streaming: విశాఖ మన్యం వీరుడు అయిన అల్లూరి సీతారామరాజు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో గతంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు అదే అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ‘మన్యం ధీరుడు’ పేరుతో ఓ సినిమా గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇపుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సందర్భంగా విశాఖలోని అల్లూరి సీతారామరాజు పౌర గ్రంథాలయంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఆర్ వి వి మూవీస్ బ్యానర్ పై ఆర్ వి వి సత్యనారాయణ లీడ్ రోల్లో నటించిన చిత్రం మన్యం ధీరుడు. ఇప్పటికే విడుదలై ఓ మోస్తరు విజయం సాధించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ అవుతుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో సినీ హబ్ గా విశాఖను మారుస్తామన్నారు. దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు.
రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామన్నారు. అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు పాత్ర చేసినటువంటి ఆర్ వి వి సత్యనారాయణ ని ఈ సందర్భంగా ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఇలాంటి చిత్రాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది కచ్చితంగా అందరు చూడదగ్గ సినిమా అని చెప్పుకొచ్చారు.
అనంతరం నిర్మాత, హీరో ఆర్ వి వి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం కత్తి యుద్ధం విలువిద్య లో శిక్షణ తీసుకున్నానన్నారు.బ్రిటిషర్లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన వీరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఇప్పటి యూత్ ఇది తెలుసుకోవాలన్నారు. ఈ చిత్రం ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయడంతో వాళ్లే ఓటీటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాద కుమార్, జి ఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









