Mario: రెడ్ కార్ వెనుక పోలీసులు.. ఆసక్తి రేపుతున్న మారియో పోస్టర్..

Mario movie poster: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో రూపొందుతున్న మారియో..చిత్రం నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదలైంది. వైవిద్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుండగా.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలైన ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.  

Written by - Vishnupriya | Last Updated : Feb 15, 2025, 03:15 PM IST
Mario: రెడ్ కార్ వెనుక పోలీసులు.. ఆసక్తి రేపుతున్న మారియో పోస్టర్..

Mario Telugu movie: దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన తన వినూత్న కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ‘మారియో’ అనే విభిన్న కథా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై, రిజ్వాన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో, అనిరుధ్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  

Add Zee News as a Preferred Source

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మారియో’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ చూస్తే.. ఇది ఒక అడ్వెంచరస్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతోందని స్పష్టమవుతోంది. ‘ఫన్ రైడ్’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. వినోదంతో పాటు ఉత్కంఠ భరితమైన ప్రయాణాన్ని అందించబోతున్న ఈ సినిమాకు, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  

ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంతో తెరకెక్కుతున్న ‘మారియో’ కూడా అలాంటి ఓ విభిన్న కథతో రాబోతోంది. కథా రచన, మాటల విషయంలో రాకెందు మౌళి కళ్యాణ్‌జీ గోగనకు సహకారం అందించారు. వినోదంతో పాటు మిస్టరీ కలగలసిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది.  

ప్రస్తుతం ‘మారియో’ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. కీలక సన్నివేశాలను షూట్ చేస్తూ, త్వరలోనే మిగిలిన అప్‌డేట్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా కనిపించనున్న ఈ సినిమా, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎంటర్టైనింగ్ అంశాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.  

‘మారియో’ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News