)
ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హరీష్ ధనుంజయ్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘మరువ తరమా’. అవంతిక, అతుల్య చంద్ర కథానాయకులుగా యాక్ట్ చేసారు. RX100 వంటి సినిమాకు పాటల రచయితగా పనిచేసిన చైతన్య వర్మ నడింపల్లి డైరెక్ట్ చేశారు. గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ తో యూత్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురువారం రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ఏలా ఉందంటే…
కథ విషయానికొస్తే : రిషి ( హరీష్ ధనుంజయ్) సింధు( అవంతిక ) అన్వీ (అతుల్య) ఓకే ఆఫీసులో కొలీగ్స్. ఆఫీసులో సింధును తొలిచూపులోనే లవ్ లో పడిపోతాడు రిషీ. మరోవైపు అన్వీ రిషిని లవ్ చేస్తూ ఉంటుంది. కాని రిషికి సింధు అంటే ఇష్టమని తెలిసి తనప్రేమని రిషికి చెప్పకుండా దాచేస్తోంది అన్వీ. అలా సింధు లవ్ లో ఉన్న రిషి ఆమె నుండి ఓ అనుకోని సంఘటన ఆధారంగా విడిపోతాడు. అలా విడిపోయిన రిషి, సింధు మళ్లి తిరిగి కలిసారా.. అన్వీ తన ప్రేమని చివరకి రిషికి చెప్పిందా, రిషికి తన తల్లి ( రోహిణి) చెప్పిన జీవిత సత్యాలు ఏమిటి.. ? అసలు ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎలాంటి ముగింపు తీసుకుందనేది తెర మీద చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే : ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయానికొస్తే.. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసాల్సిందే. దర్శకులు చేయాల్సిందల్లా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించడమే అని చెప్పాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ అది ఉంటుంది. కాని ప్రతీ సీన్ లో షాట్ పంచులతో ఎక్కడ బోర్ కొట్టకుండా నాచురల్ కామెడీతో నడిపించాడు. అలాగే పాట కూడా కథకి తగ్గట్టుగా వినసొంపుగా అనిపించాయి. ఇక సెకండాఫ్ ను పూర్తిగా కథ, కథనాలపైనే దృష్టి పెట్టాడు డైరెక్టర్. ఆడియన్స్ ను ఎమోషనల్ గా స్టోరికి కనెక్ట్ అయ్యేలా చేసాడు. తెరపై పాత్రలు మాట్లాడుతుంటే అరె మన దోస్తులకు కూడా ఇలానే జరిగింది. ముఖ్యంగా రోహిణి పాత్ర ఓ సందర్భంలో చెప్పే డైలాగ్స్ ఆడియన్స్ ను ఆలోచింపజేస్తాయి. ప్రేమ ఎందుకు పుడుతుంది. దర్శకుడి కలానికి ఎలాంటి పదును ఉందో చెప్పడానికి ఉదాహరణ. అలాగే అమ్మాయిల విషయంలో ఆప్షన్లు ఉంటాయి ఏమో కానీ అమ్మ విషయంలో ఆప్షన్స్ ఉండవు లాంటి మాటలు బాగున్నాయి. మనకు తెలిసిన మన చుట్టూ ఉండే కథను రియలిస్టిక్ నేపథ్యంలో తెరకెక్కించి మెప్పించాడు. కెమెరా మెన్ పనితనం బాగుంది. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉన్నా.. సెకండాఫ్ ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. నిర్మాణ విలువులు బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
హరీష్ ధనుంజయ్ చూడడానికి క్యూట్ గా పక్కింటి కుర్రాడు తరహాలో ఉన్నాడు. నటనలో మంచి ఈజ్ చూపించాడు. యూత్ ఫుల్ కథలకు బాగా సెట్ అవుతాడు. సంభాషణలు పలికిన విధానం బాగుంది. నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. అవంతిక చాలా బాగా నటించింది. అతుల్య పాత్ర పరిధి మేరకు మెప్పించింది. రోహిణి పాత్ర గుర్తిండి పోతుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘మరువ తరుమా’.. ఎంగేజ్ చేసే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
రేటింగ్: 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.