)
Mass Jathara 2 Days Box Office Collections: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ఎఫెక్ట్ రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ పై గట్టి ఎఫెక్టే చూపెట్టింది. రెండు భాగాలను ఒక భాగంగా ఎడిట్ చేసి విడుదల చేసిన చిత్రానికి ప్రేక్షకులను నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. దీంతో అప్పటికే థియేటర్స్ లో ఓటీటీ, టీవీ్లో చూసిన సినిమానే అయినా.. ప్రేక్షకులు పెద్ద తెరపై ‘బాహుబలి ది ఎపిక్’ చూడ్డానికి ఎగబడుతున్నారు. ఇండైరెక్ట్ గా ఈ సినిమా ఎఫెక్ట్ రవితేజ తాజాగా చిత్రం ‘మాస్ జాతర’పై పడింది. ఇక మాస్ మహారాజా కూడా హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలరిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత కాస్త గ్యాస్ తీసుకొని.. లేటెస్ట్ ‘మాస్ జాతర’చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
మాస్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన ‘మాస్ జాతర’ మూవీ మెజారిటీ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. మొత్తంగా ఈ సినిమాను రవితేజ పాత సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలైనా.. విక్రమార్కుడు, క్రాక్ లతో పాటు పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’, రీసెంట్ గా వచ్చిన ‘ఓజీ’ సినిమాలను పోలి ఉంది. మొత్తంగా ఆయా సూపర్ హిట్ చిత్రాలకు జిరాక్స్ కాపీ అని చెప్పాలి. అయితే అక్కడక్కడ కొన్ని మాస్ ఎలివేషన్స్, కామెడీ సీన్స్ పండినా.. మిగతాదంతా రొటిన్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. పైగా పోటీలో బాహుబలి రీ రిలీజ్ కావడం.. ఈ సినిమాకు మరింత మైనస్ గా మారింది.
మొత్తంగా ఈ సినిమా ప్రీమియర్స్ + మొదటి రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ (రూ. 12 కోట్ల గ్రాస్) మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేవలం రూ. 35 లక్షలు మాత్రమే రాబట్టింది. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 45 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.8 కోట్ల షేర్ (రూ. 14 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. మరి ఫుల్ రన్ లో ‘మాస్ జాతర’ ఏ మేరకు వసూళ్లను రాబట్టి అనుకున్న బిజినెస్ టార్గెట్ ను పూర్తి చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఈ రోజు నుంచి వసూల్లు దారుణంగా పడిపోయాయి. ఓ రకంగా బాహుబలి ఎఫెక్ట్ తో రెండు రోజుల్లోనే ‘మాస్ జాతర’ చాప చుట్టేసిందనే చెప్పాలి. అంతేకాదు రవితేజ ఫ్లాపుల పరంపరను ‘మాస్ జాతర’ ఆపలేదనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.