Mazaka First Review: సందీప్ కిషన్ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇపుడు ‘మజాకా’ సినిమాతో పలకరించబోతున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా నక్కిన త్రినాథ రావు కామెడీ ప్లస్ తెలిసిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ఓ మోస్తరు అంచాలున్నాయి. పైగా రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తోంది.
మరోవైపు సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా హీరోగా అంతగా ఫామ్ లో లేడు. కానీ నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో పాటు రీతూ వర్మ, రావు రమేశ్ తో అన్షు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. దీంతో ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలంగాణలో రూ. 3.2 కోట్లు.. రాయలసీమలో రూ. 1.8 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో రూ.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా రూ.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక + మిగిలిన భారత దేశంలో ఈ సినిమా రూ. 1.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 10.50 కోట్ల దాకా జరిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే.. రూ. 11.50 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే సినిమా హిట్ అందుకుంటుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
మహా శివరాత్రి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. శివరాత్రి అడ్వాంటేజ్ తో వీకెండ్ కలిసొచ్చే అవకాశాలున్నాయి. సందీప్ కిషన్ రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ విషయానికొస్తే. మజాకా మూవీ .. రూ. 10.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఊరు పేరు భైరవ కోన..రూ. 10.20 కోట్ల బిజినెస్ చేసింది. అటు మైఖేల్ మూవీ.. రూ. 6.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. గల్లీ రౌడీ.. రూ. 2.75 కోట్ల బిజినెస్ చేస్తే.. A1 ఎక్స్ ప్రెస్ మూవీ మాత్రం రూ. 4.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా చూసుకుంటే ‘మజాకా’ మూవీ సందీప్ కిషన్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









