Trinadha Rao Nakkina Next Movie: స్టార్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన మరో ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఈసారి యంగ్ హీరోతో ఆయన మూవీ మొదలు పెట్టారు. తనీష్ హీరోగా నటించిన 'మేము వయసుకు వచ్చాం' మూవీతో తొలిసారి మెగా ఫోన్ పట్టిన ఆయన.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్‌ను మెప్పించారు. ఆ తరువాత ప్రియతమా నీవచట కుశలమా అంటూ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ తెరకెక్కించారు. నువ్విలా మూవీతో మరో డిఫరెంట్ ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక రాజ్ తరుణ్‌తో సినిమా చుపిస్తా మావ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత నేచురాల్ స్టార్ నానితో నేను లోకల్, ఎనర్జిట్ స్టార్ రామ్‌తో హలో గురు ప్రేమ కోసమే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది.
ఇక రీసెంట్‌గా సందీప్ కిషన్‌తో మజాకా మూవీతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమా థియేటర్స్‌లో ఉండగానే.. ఆయన మరో సినిమాను స్టార్ట్ చేశారు. ఈసారి యంగ్ హీరో హవీష్ కోనేరుతో హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ మూవీస్‌లో సక్సెస్ అయిన త్రినాధ రావు.. మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మూవీని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సెట్స్‌పైకి తీసుకువెళ్లారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
హీరో హవీష్ కోనేరు విషయానికి వస్తే.. నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్రినాధ రావు డైరెక్షనలో ఆయన చేస్తున్న రెండో సినిమా ఇది. ఈసారి సరికొత్తగా పరిచయం కాబోతున్నాడు. ఓ రచయిత ఈ సినిమాకు కథను అందించారట. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. హవీష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఫార్మల్ షూట్‌ను మొదలుపెట్టిన మేకర్స్.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Also Read: Ramadan Importance: రంజాన్ ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు
Also Read: Kannappa Teaser: కన్నప్ప టీజర్.. ప్రభాస్ లుక్ హైలెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









