Mazaka OTT Streaming: ఉగాది పండగ సందర్భంగా ZEE5 తన వీక్షకులకు కోసం డబుల్ వినోదాన్ని అందిస్తోంది. ZEE5లో తాజాగా వచ్చిన కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఎంటర్టైన్మెంట్ చిత్రం మజాకా మూవీ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. మజాకా ప్రస్తుతం జీ5 ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా జీ5 ఓటీటీలో దూసుకుపోతుంది. కామెడీ, రొమాన్స్, తండ్రీకొడుకుల సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కించిన మజాకా ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది.
‘మజాకా’ చిత్రంలో రావు రమేష్, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. వీరి కాంబినేషన్ వచ్చిన సన్నవేశాలను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎంటర్టైనింగ్ తో పాటు మంచి సందేశాన్ని కూడా అందించింది. జీ5లో రీసెంట్ గా వచ్చిన పలు చిత్రాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
ZEE5లో SVOD సౌత్ వైస్ ప్రెసిడెంట్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ .. రీజనల్ లాంగ్వేజ్ భారతీయ చిత్రాల్లో ప్రస్తుతం మజాకా చిత్రం ZEE5లో ట్రెండ్ అవుతోంది. తెలుగులో కొత్త మైలురాయిని నెలకొల్పిన మజాకా అద్భుతమైన విజయంతో మేము చాలా హ్యాపీగా ఉన్నట్టు పేర్కొన్నారు.
రావు రమేష్ మాట్లాడుతూ .. ‘మజాకాకు వచ్చిన అద్భుత స్పందన చూసి నేను థ్రిల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను జనాలు ZEE5 లో ఇంత ఆదరించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకుల నుండి వచ్చిన సానుకూల స్పందన చూసి ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ .. ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మజాకాకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. పక్కింటి అబ్బాయిలా ఉండే కృష్ణ పాత్రను పోషించడం సవాల్‌గా అనిపించినా.. అలాంటి పాత్రను పోషించడం హ్యాపీగా ఉందన్నారు. మజాకా అద్భుతమైన వినోదాన్ని పంచే చిత్రమన్నారు. కామెడీ కమ్ ఫ్యామిలీ ఎమోషన్ తో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదిరించడాన్ని మరిచిపోలేకపోతున్నాడు.
జీ5 భారతదేశపు అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్. మల్టీ లింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా వివిధ భాషల్లో కంటెంట్ అందిస్తోంది. లోకల్ నుంచి గ్లోబల్ కంటెంట్ వరకు అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. జీ5 ఓటీటీలో 3,500 సినిమాల లైబ్రరీ కలిగి ఉంది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, తెలుగు, తమిళ్, పంజాబీ 12 భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్ తో అలరిస్తోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









