Chikiri Chikiri Record : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని ‘మీసాల పిల్ల’ పాట మొదట మిశ్రమ స్పందన అందుకున్నా, కొన్ని రోజుల్లోనే వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్‌లు వరదలా వచ్చి, అభిమానులు ఊగిపోతున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటతో మరోసారి తన మార్క్ చూపించాడు.
ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట కూడా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ పాటపై కొన్ని కాపీ ఆరోపణలు వచ్చినా, దాని సక్సెస్‌ను ఆపలేకపోయాయి.
‘మీసాల పిల్ల’, ‘చికిరి చికిరి’ పాటల సక్సెస్‌తో ఈ రెండు సినిమాలపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. పాటలు హిట్ అవ్వడం అనేది సినిమా సక్సెస్‌లో సగం అని సినీ నిపుణులు అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ‘గోదారి గట్టుమీద’ పాట కూడా ఇలాంటి ప్రభావం చూపినట్టే, ఇప్పుడు ఈ మెగా పాటలు కూడా అలాంటి ఊపు తెచ్చాయి.
చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా 2026 జనవరి 12న విడుదల కాబోతోంది. ఇందులో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా జనవరి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత సక్సెస్ సాధిస్తాయో చూడాలి కానీ, అభిమానుల్లో మాత్రం ఉత్సాహం పీక్స్‌లో ఉంది.
Also Read: Niharika Konidela: హీరోయిన్ నిహారికతో దర్శకుడు రాఘవేంద్ర రావు అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
Also Read: IPL 2026 Mini Auction: స్టార్ ప్లేయర్లను పంపించేస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. ఎవరెవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









