Mega Hero Rejected Scripts: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ కుటుంబానికి చెందిన యువ హీరో వైష్ణవ్ తేజ్ గత రెండు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, ‘ఉప్పెన’ సినిమాతో ఘన విజయాన్ని సాధించి, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆ తర్వాత విడుదలైన ‘కొండపొలం,’ ‘రంగ రంగ వైభవంగా,’ ‘ఆది కేశవ’ సినిమాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా శ్రీ లీల హీరోయిన్గా వచ్చిన ఆదికేశవ సినిమా డిజాస్టర్ చవిచూసింది. ఈ సినిమాకి మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు. అంతకుముందు కూడా వైష్ణవి తేజ్ కి ఎన్నో ఫ్లాపులు వచ్చిన.. ఈ సినిమా వల్ల ఈ హీరో పేరు పైన పడిన ప్రభావం మరి ఎక్కువగా నిలిచింది. అసలు ఈ హీరోకి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకోవడం కూడా రాదా అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో, కొత్త సినిమా కోసం వెతుకుతున్న ఆయన..దాదాపు 100 కథలు విన్నప్పటికీ, ఏ కథను కూడా ఒప్పుకోలేదట. పెద్ద నిర్మాతలు వైష్ణవ్ తేజ్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఈ యువ హీరో ఇప్పటి వరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ సహా, ఇతర ప్రముఖ బ్యానర్లు కూడా ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన కథ కోసం వెతుకుతున్నాడని సమాచారం.
సినిమాల ఎంపికలో వైష్ణవ్ తేజ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాప్‌లు ఎదురైన తర్వాత, ఆయన తన మార్కెట్‌ను కాపాడుకోవడానికి, విజయవంతమైన కథ కోసం వేచి చూస్తున్నాడంట. ఒకపక్క వరుణ్ తేజ్ కూడా వరుసగా ఎన్ని ఫ్లాపులు వస్తున్నాయో తెలిసిన సంగతే. అయినా కానీ వరుణ్ తేజ్ ఆగకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి తప్పులు చేయకుండా.. మంచి స్క్రిప్ట్ కోసం ఈ హీరో చాలా ప్రయత్నిస్తున్నారని వినికిడి.
వైష్ణవ్ తేజ్ త్వరగా ఒక మంచి కథను ఎంచుకుని, కొత్త సినిమాతో మెగా ఫ్యాన్స్‌ను అలరించాలని కోరుకుంటున్నారు. మళ్లీ హిట్ కొట్టి, టాలీవుడ్‌లో తన స్థాయిని స్థిరపరచుకోవాలని ఆయనకు అభిమానులు ఆశిస్తున్నారు. ఇక, వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఏ బ్యానర్‌లో తెరకెక్కుతుందో చూడాలి.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









