Chiranjeevi and Nagababu:
మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, విజయదుర్గా, మాధవి కలిసి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముచ్చటించారు. కుటుంబ బంధాలు, మహిళా సాధికారిత గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మెగా మదర్ అంజనమ్మ తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, ఉమ్మడి కుటుంబ విలువల గురించి వివరించారు.
మెగాస్టార్ చిరంజీవి మాటల్లో..
చిరంజీవి మాట్లాడుతూ, “నాకు మా నాన్న, అమ్మ నుంచి ప్రేమ, ఆప్యాయతల విలువ తెలిసాయి. మా నాన్నకు తక్కువ జీతమే వచ్చినా కుటుంబాన్ని చక్కగా పోషించారు. మా అమ్మ సైతం నాన్న ఫ్యామిలీని ఎంతో బాగా చూసుకున్నారు. అందువల్ల మాకు కుటుంబం అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు కంటే బంధాలే మాకు అసలైన సంపద. మా అమ్మ ఎప్పుడు మాకు నైతికంగా భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లల్ని స్వేచ్ఛగా పెంచడం ఎంతో ముఖ్యం. నా జీవిత ప్రయాణంలో మా అమ్మ ఇచ్చిన ఆదరణే నాకు బలంగా నిలిచింది,” అన్నారు.
నాగబాబు మాటల్లో..
నాగబాబు మాట్లాడుతూ, “చిన్నప్పుడు ఇంట్లో ఎక్కువ పనులు అన్నయ్యే చేసేవారు. నేను మాత్రం అల్లరి చేసేవాడిని. కళ్యాణ్ బాబు చాలా వీక్‌గా ఉండేవాడు, అందుకే అమ్మ ఎక్కువగా అతనిపై శ్రద్ధ చూపేవారు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు ఇంటికి వస్తే అమ్మ అతనికి ఇష్టమైన వంటలు వండి పెడతారు. మా అమ్మని హగ్ చేసుకుంటే నాకు ఎంతో ధైర్యం వస్తుంది. ఆమెకు ఉన్న ఆ శక్తి నాకు ఎన్నో సార్లు మానసిక శాంతి ఇచ్చింది,” అన్నారు.
అంజనమ్మ మాటల్లో..
అంజనమ్మ మాట్లాడుతూ, “నా పిల్లలను ఉమ్మడి కుటుంబం విలువలతో పెంచాను. ప్రేమ, ఆప్యాయత అనేవి ఎంతో కీలకం. కానీ ఇప్పుడీ తరం కొంత భిన్నంగా ఉంది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. అందరూ కలిసి మెలిసి ఉండటం ఎంతో అవసరం. మా పిల్లలు ఈ విలువల్ని అర్థం చేసుకుని కుటుంబ బంధాలను కొనసాగిస్తున్నారు అని చూసి గర్వంగా ఉంది,” అన్నారు.
మెగా సిస్టర్స్ మాటల్లో..
విజయదుర్గా మాట్లాడుతూ, “మా అమ్మ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండమని చెప్పేవారు. మా కాళ్ల మీద మేము నిలబడాలని ప్రోత్సహించేవారు. ఈ మాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి,” అన్నారు.
మాధవి మాట్లాడుతూ, “నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, మా అమ్మ నాకు అండగా నిలిచారు. నా బాధలను పంచుకుని ధైర్యం చెప్పిన వ్యక్తి మా అమ్మ,” అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









