
Allu Kanakaratnam Last Rites: దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్య, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం (94) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ వార్త అటు అల్లు కుటుంబంతో పాటు మెగా ఫ్యామిలీలో విషాదం నింపింది.
మధ్యాహ్నం కోకాపేటలో జరిగిన అల్లు కనకరత్నం అంత్యక్రియల్లో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ఆమె అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి, మనవడు అల్లు అర్జున్ ఆమె పాడె మోశారు. కనకరత్నం కొడుకు అల్లు అరవింత్ విషాద హృదయంతో కుండని మోస్తూ కనిపించారు. చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అయాన్ కూడా ఆమె పాడె మోశారు. అల్లు కనకరత్నం కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు తరలివచ్చారు. అంతటి విషాదకర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వృద్ధాప్య సమస్యల కారణంగా అల్లు కనక రత్నమ్మ మృతిచెందినట్లు సమచారం. శనివారం (ఆగస్టు 30) తెల్లవారుజామున ఆమె మరణించినట్లు చెబుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ శివారు కోకాపేటలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు అర్జున్ ఇంట్లో విషాదం వార్త విని టాలీవుడ్ వర్గాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. నాయనమ్మ మరణవార్త వినగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయి నుంచి వెంటనే హైదరాబాద్ వచ్చారు.
మరోవైపు మైసూర్లో 'పెద్ది'షూటింగ్లో పాల్గొన్న రామ్ చరణ్ కూడా అమ్మమ్మని కడసారి చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు వైజాగ్ లో పబ్లిక్ మీటింగ్ ఉండడం వల్ల వారు రాలేకపోయారని సమాచారం. రేపు వారు హైదరాబాద్ వచ్చి అల్లు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల చిత్రసీమలో అభిమానులతో పాటు అల్లు ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook