Chiranjeevi: మీరు లేనిదే నేను లేను.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!

Chiranjeevi: చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో, నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా చిరంజీవి దీనిపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.  

Written by - Aruna Maharaju | Last Updated : Jan 20, 2026, 05:51 PM IST
Chiranjeevi: మీరు లేనిదే నేను లేను.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!

Megastar Chiranjeevi Emotional Tweet: మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో, నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలో డ్యాన్సులు, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నిట్లో వింటేజ్ చిరంజీవిని చూపించడంతో ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల గ్రాస్ దాటేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో చిరంజీవి కృతజ్ఞతతో ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Add Zee News as a Preferred Source

చిరంజీవి తన ట్వీట్‌లో.. మన శంకరవరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది.

వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు మరియు సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్.. మీ చిరంజీవి అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవి ట్వీట్‌ని వైరల్ చేస్తున్నారు.

Also Read: IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే పండగ.. ఒకే రోజు రెండు భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు..!

Also Read: Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News