Chiranjeevi meets Kalatapasvi Viswanath: తెలుగు ( Tollywood) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని.. ఎందరో వ్యక్తుల ప్రతిభను నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. దీపావళి పర్వదినం సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సతీసమేతంగా కళాతపస్వీ కె.విశ్వనాథ్ (Kalatapasvi Viswanath) ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. కె.విశ్వనాథ్, చిరంజీవి తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమాల విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి.. విశ్వనాథ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అయితే మెగాస్టార్ తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదిక ద్వారా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘అందరికి దీపావళి శుభాకాంక్షలు.. పండగ అంటే మన ఆత్మీయులని కలవటం, ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం.. అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన, నాకు గురువు మార్గదర్శి, ఆత్మబంధువు కే.విశ్వనాధ్ గారిని కలిసి, ఆ దంపతులని సత్కరించుకున్నాను. వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తి ఇచ్చింది.’’ అంటూ ట్విట్ చేశారు.  Also read: Amyra Dastur: మతిపోగొడుతున్న అమైరా..


అయితే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి.. వంటి సినిమాలు ఆయన కెరీర్‌లోనే మైలురాళ్లుగా నిలిచాయి. ఈ సినిమాలతో కె.విశ్వనాథ్ చిరంజీవిని అటు మాస్‌ ప్రేక్షకులతో పాటు ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా దగ్గరయ్యేలా చేశారు. అలాంటి గురువు కె.విశ్వనాథ్‌ను కలవడంపై అభిమానులు చిరంజీవిని అభినందిస్తున్నారు.


Also read: Tamannaah: హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ


Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక


Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe