Chiranjeevi says pawan kalyan son mark shankar discharged from hospital: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మార్క్ శంకర్ కు చేతికి, కాళ్లకు తీవ్రంగా గాయలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లిపొవడం వల్ల తొలుత మార్క్ శంకర్ కు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత నార్మల్ వార్డ్ కు తరలించారు. ఒక రోజు అబ్జర్వేషన్ లో ఉంచారు.
అయితే.. తాజాగా.. మెగాస్టార్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మార్క్ శంకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చెప్పారు . మా ఇంటి దైవం ఆంజనేయ స్వామి దయ వల్ల గండం గట్టెక్కిందన్నారు. మా ఇష్టదైవం.. మా పిల్నాడ్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడరని అన్నాడు.
మీ అందరి ప్రార్థనలు, దీవెనలతో మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని చిరంజీవి చెప్పుకొవచ్చారు. పూర్తిగా కొలుకొవడానికి మరికొంత సమయం పడుతుందని, ఇప్పుడైతే మాత్రం ఎలాంటి ఇబ్బందిలేదని.. మార్క్ శంకర్ కోసం, మెగా కుటుంబం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా తమ ధన్యవాదాలు అంటూ చిరు సోషల్ మీడియా వేదికగా మార్క్ శంకర్ హెల్త్ అప్ డేట్ ను పంచుకున్నారు.
దీంతో ప్రస్తుతం మెగా అభిమానులు మాత్రం ఒకింత టెన్షన్ నుంచి రిలాక్స్ అయినట్లు తెలుస్తొంది. మార్క్ శంకర్ ఇంకా వేగంగా కొలుకొవాలని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మార్క్ శంకర్ కోలుకొవాలని అనేక ఆలయాల్లో మెగా స్టార్ అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ప్రకటన చూసి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









