Chiranjeevi Award: 'బ్రిటన్‌ అవార్డు' వేడుకలో చేతివాటం.. మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్

Chiranjeevi Condemns Fan Meetings Collection Money: అత్యంత గౌరవం అందుకున్న అవార్డు వేడుకకు సంబంధించి కొందరు చేసిన పనికి మెగాస్టార్‌ చిరంజీవి కలత చెందారు. వారు చేసిన పనిపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 20, 2025, 10:35 PM IST
Chiranjeevi Award: 'బ్రిటన్‌ అవార్డు' వేడుకలో చేతివాటం.. మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్

Chiranjeevi Fans Meetings: విదేశాల్లో భారత సినీ పరిశ్రమలోనే అత్యంత గౌరవం అందుకున్న నటుడిగా మెగాస్టార్‌ చిరంజీవి నిలిచారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆ దేశ అత్యున్నత అవార్డును చిరంజీవి స్వీకరించారు. దేశంలో మరే నటుడికి లభించిన అరుదైన గౌరవం అందుకున్న నటుడిగా మెగాస్టార్‌ గుర్తింపు పొందారు. అయితే ఈ అవార్డు వేడుకను ఉపయోగించుకుని కొందరు డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. అభిమానుల నుంచి డబ్బులు వసూళ్లు చేశారనే వార్త తన దృష్టికి రావడంతో చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి హెచ్చరిక జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Tollywood In AP: ఆంధ్రప్రదేశ్‌కు టాలీవుడ్‌ షిఫ్ట్‌.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో గురువారం చిరంజీవికి 'జీవన సాఫల్య పురస్కారం'- (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు) అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు అందించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా తిలకించింది. విదేశీ పార్లమెంట్‌ భవనంలో ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే చిరంజీవి లండన్‌ పర్యటనలో కొందరు తమ చేతివాటం ప్రదర్శించారు.

Also Read: Vijay GOAT Movie: విజయ్, మీనాక్షి చౌదరి నటించిన 'GOAT' మీ జీ తెలుగులో! ఎప్పుడో తెలుసా?

లండన్‌ పర్యటనకు వస్తున్న చిరంజీవిని కలిసేందుకు.. అభిమానులతో చిరంజీవి సమావేశమవుతారని.. దానికి సంబంధించి ఫీజు పేరిట డబ్బులు వసూళ్లు చేశారని సమాచారం. ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. డబ్బులు వసూళ్లు చేయడంపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వార్తలు చిరంజీవి దృష్టికి వచ్చాయి. అవార్డు అందుకున్న అనంతరం మెగాస్టార్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. డబ్బులు వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రియమైన ఫ్యాన్స్. యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపి ప్రేమ అభిమానం నా గుండెకు తగిలింది. అయితే ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేశారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి పనిని నేను అంగీకరించను. దీనిని ఖండిస్తున్నా' అని చిరంజీవి 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. 'అభిమానుల సమావేశం పేరిట డబ్బులు వసూళ్లు చేసిన వారు వెంటనే తిరిగి ఇచ్చేయండి' అని మెగాస్టార్‌ ఆదేశించారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించారు.

'ఇలాంటి (డబ్బులు వసూళ్లు) వాటిని నేను ఎప్పుడు, ఎక్కడా కూడా ప్రోత్సహించను. ఈ విషయాన్ని గుర్తించాలి. మన (ఫ్యాన్స్‌) మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం అనేది వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. మన ఆత్మీయ కలయిక లాభార్జనకు దూరంగా ఉంచుదాం' అంటూ అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News