Megastar: క్యాన్సర్ తో బాధపడుతున్న మెగా స్టార్.. ఫైనల్ గా వచ్చేసిన క్లారిటీ..!

Mammootty health update: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు అన్న ఒక విషయం తెగ వైరల్ అయింది. అయితే, ఆయన పీఆర్ టీం ఇచ్చిన వివరణతో ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చింది.  

Written by - Vishnupriya | Last Updated : Mar 18, 2025, 06:38 PM IST
Megastar: క్యాన్సర్ తో బాధపడుతున్న మెగా స్టార్.. ఫైనల్ గా వచ్చేసిన క్లారిటీ..!

Mammootty cancer rumors: మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా మమ్ముట్టి ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.  

Add Zee News as a Preferred Source

ఇందులో ముఖ్యంగా.. మమ్ముట్టి క్యాన్సర్ బారినపడ్డారని, అందుకే సినిమాలకు విరామం తీసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇది అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. ఆయన తక్కువగా కనిపించడం.. షూటింగ్‌లకు దూరంగా ఉండటం వంటివి ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.  

ఈ రూమర్లకు తెర దించుతూ మమ్ముట్టి పీఆర్ టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'ప్రస్తుతం మమ్ముట్టి రంజాన్ ఉపవాసం చేస్తున్నారు. అందుకే ఆయన కొన్ని రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ఈ కారణంగా తన షూటింగ్ షెడ్యూల్‌ని కూడా వాయిదా వేసుకున్నారు. విరామం తర్వాత మోహన్‌లాల్, మహేష్ నారాయణన్  సినిమా షూటింగ్‌లో మళ్లీ పాల్గొంటారు' అని ప్రకటించింది.  

అదే సమయంలో, ‘మమ్ముట్టికి క్యాన్సర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్‌లను నమ్మాల్సిన పనిలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది.  

ఈ ప్రకటనతో మమ్ముట్టి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న నకిలీ వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ‘Stay Strong Mammootty’ అనే హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.  

మమ్ముట్టి ఆయన వయసుని కూడా పట్టించుకోకుండా.. ఎంతో ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్స్‌లో 'బజార్ రో', 'కేఎస్ బి ఎఫ్'  సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతున్నారు.  దీంతో ఈ హీరోకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు అనే పెద్ద క్లారిటీ వచ్చేసింది. మరో పక్క ఆయన కొరకు దుల్కర్ సల్మాన్ సైతం…మలయాళం లోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

Also Read: Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

Also Read: Bumper Bonanza: ఐపీఎల్‌ బంపర్‌ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News