Men laugh at Vicky kaushal Chhaava movie climax at navi Mumbai: ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రస్తుతం అన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 14న ఈ మూవీ విడుదలైంది. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఛావా తెరకెక్కింది. చరిత్రలో ఔరంగాజేబ్ అరాచకాలను మరాఠాలు ఏ విధంగా ఎదుర్కొన్నారో ఈ సినిమాలో చూపించారు.
అంతే కాకుండా.. ఈ మూవీలో ముఖ్యంగా శంభాజీ మహారాజ్ నటన చూసి ప్రతి ఒక్కరు కూడా తీవ్ర భావోద్వేగానికి గురౌతున్నారు. స్వరాజ్యం కోసం.. ఇంతలా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ఇంటి త్యాగాలను చూసి గొప్ప వీరుడి కథను తమకు తెలియకుండా చరిత్ర కారులు మరుగున పడేశారని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు సైతం చేశారు. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుని పోతుంది.
बालाजी थिएटर, कोपरखैरणे येथे "छावा" चित्रपटातील शेवटच्या दृश्यांवर हे निजामी मराठ्यांचे हे मुस्लिम मावळे हसत होते.
काही छत्रपतींच्या मावळ्यांनी त्यांना अद्दल घडवून पोलीसांच्या ताब्यात दिले.
मुस्लिमांचे लांगूलचालन करणाऱ्या निजामी मराठ्यांना हा व्हिडीओ दाखवा. pic.twitter.com/DJoOMcOwDc
— टवाळखोर कार्ट (@Tawalkhorkart) February 28, 2025
ఇటీవల తెలుగులో సైతం చావా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఆశ్చర్యంలేదని సినిమా ప్రియులు అంటున్నారు. అలాంటి ఎమోషన్, దేశ భక్తి ఉన్న ఈ సినిమాను చూసి థియేటర్ కు వచ్చిన కొంత మంది వెకిలిగా ప్రవర్తించారు. దీంతో అక్కడున్న మరికొందరు వీరికి బుద్ది చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
నవీ ముంబైలోని ఒక థియేటర్లో చావా మూవీని ఒక థియేటర్ లో ప్రదర్శించారు. అయితే.. ఐదుగురు ఆకతాయిలో మూవీ క్లైమాక్స్ చూసి వెకిలిగా నవ్వడం ప్రారంభించారు. అంతేకాకుండా.. విక్కి కౌశాల్ నటన పట్ల ఎగతాళిగాను మాట్లాడారు. దీంతో అక్కడున్న కొంత మంది వీరిని పట్టుకుని బైటకు ఈడ్చుకుని వచ్చారు.
Read more: Chhaava Telugu Trailer Talk: అదిరిపోయిన ఛావా తెలుగు ట్రైలర్.. టాలీవుడ్ ఇండస్ట్రీపై శంభాజీ దండయాత్ర..
అంతేకాకుండా.. వీరి పనులకు చెవులు పట్టుకుని గుంజీలు తీయించారు. శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ లకు క్షమాపణలు చెప్పించారు. తమ తప్పులకు అందరికి శిరస్సు వంచి క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు .ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటవైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









