)
Mirai Review: హనుమాన్ వంటి భారీ విజయం తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. భారీ ఎత్తున సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిరాయ్’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నెల 12న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని నిర్మాత దాదాపు అన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారట. మరోవైపు కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బేస్ పద్ధతుల్లో రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ మంచిగానే వచ్చినా.. ఒకవేళ బ్రేక్ ఈవెన్ పూర్తి కాకపోతే.. అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘మిరాయ్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఓ మీడియం రేంజ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ సినిమాను తెలుగులో కాకుండా హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. మిగతా భాషల్లో ఆయా రాష్ట్రాల్లోని అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కర్ణాటక, హిందీ ఇతర భాషలతో పాటు ఓవర్సీస్ కలిపి ీ సినిమా రూ. 36.50 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ..రూ. 10 కోట్లు.. రాయలసీమ.. రూ. 5 కోట్లు..మిగతా ఆంధ్ర ప్రదేశ్ లో.. రూ. 12 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 27 కోట్లు.. కర్ణాటక + డబ్బింగ్ + మిగిలిన భారత దేశం కలిపి రూ. 5 కోట్లు.. అమెరికా ఇతర విదేశాల్లో కలిపి ఈ సినిమా రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకోవాలంటే రూ. 37.50 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా రూ. 70 కోట్ల గ్రాస్ రాబడితే ఈ సినిమా సేవ్ అవుతుంది. ఈ సినిమాతో మంచు మనోజ్ విలన్ గా టర్న్ తీసుకున్నాడు. అతను ఈ సినిమా తర్వాత ప్రతి నాయకుడిగా మరిన్ని అవకాశాలు అందుకుంటాడా అనేది చూడాలి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్
మొత్తం మీద ‘మిరాయ్’ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు చిత్రం టాక్ సొంతం చేసుకుంటే ఈ బిజినెస్ ను రికవరీ చేయడం ఈజీ అని చెప్పాలి. ఈ సినిమాకు యునానిమస్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించడం ఖాయం. మరి ఈ సినిమా ఏ మేరకు ఎలాంటి ఫలితం అందుకుంటుదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.