)
Mirai Movie Controversy: టాలీవుడ్లో కొత్తగా విడుదలైన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ చిత్రం మరో కారణంతో చర్చల్లోకి వచ్చింది. ఈ సినిమాపై కాపీరైట్ వివాదం తలెత్తింది.
విజయవాడకు చెందిన రచయిత చైతన్య గిరిధర్ హైకోర్టును ఆశ్రయించారు. తన రచన "ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్ – అశోక అండ్ ది నైన్ అన్నోన్ మెన్” తో పోలిస్తే మిరాయ్ కథలో కొన్ని కీలకమైన అంశాలు ఒకేలా ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. తన రచనకు న్యాయం జరగాలని హై కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వివాదం కోర్టులోకి వెళ్లకముందే మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే సెప్టెంబర్ 13, 2025న కొన్ని న్యూస్ వెబ్సైట్లు ఈ సినిమా కథలోని కొన్ని భాగాలు ఒక పుస్తకాన్ని తలపిస్తున్నాయంటూ వార్తలు వేశాయి. ఆ కథనాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు వాదోపవాదాలు మొదలుపెట్టారు. మిరాయ్ నిజంగానే ఆ పుస్తకం నుంచి ప్రేరణ పొందిందా? లేక కేవలం యాదృచ్ఛికమా? అనేది హై కోర్టు నిర్ణయించాలి.
ఈ పిటిషన్ ఫైల్ అయిన తరువాత, టాలీవుడ్లో ఈ విషయం మరింత హాట్ టాపిక్ అయింది. సినిమా కొనసాగుతూనే ఉన్నప్పటికీ, ఈ కాపీరైట్ వివాదం కారణంగా మిరాయ్ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా వైరల్ అయ్యింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, అభిమానుల మధ్యనూ ఇప్పుడు చర్చ ఒకటే.. మిరాయ్ నిజంగా ఒక ఒరిజినల్ క్రియేషన్‌నా? లేక చైతన్య గిరిధర్ రాసిన పుస్తకం నుండి తీసిన కథా?
ఒకవైపు సినిమా కలెక్షన్లు రికార్డును మూత మోగిస్తుంటే, మరోవైపు ఈ వివాదం టాలీవుడ్లో కాపీరైట్ రక్షణలపై పెద్ద డిబేట్‌కు దారితీస్తోంది. మరి చిత్ర బృందం ఈ వివాదం గురించి ఇప్పటికైనా నోరు విప్పుతుందో లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.