)
Mirai Review and Rating:
కథ
అశోకుడు కలింగ యుద్ధం తరువాత తన దగ్గరున్న రహస్య గ్రంథాలను తొమ్మిది భాగాలుగా చేసి విశ్వాసమైన తన భటుల చేత ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో భద్రపరుస్తాడు. కాలం గడుస్తూ, 2000 సంవత్సరంలో అంబిక (శ్రియా శరణ్) అనే దివ్య దృష్టి కలిగిన స్త్రీ ఆ గ్రంథాలను కాపాడుతుంది. అయితే మహబీర్ లామా (మంచు మనోజ్) అనే దుష్టుడు అమరత్వం కోసం ఆ గ్రంథాల కోసం వేట మొదలుపెడతాడు. ఆ తొమ్మిది గ్రంథాలు ఒక చోట చేరితే తానే దేవుడు అవుతాడు. అంతేకాదు ప్రపంచాన్ని తన గుప్పిట పట్టుకోవాలనుకుంటాడు. ఈ సందర్భంలో హైదరాబాద్‌లో సాధారణ జీవితాన్ని గడిపే వేద (తేజ సజ్జ) ఆ పోరాటంలో అనుకోకుండా భాగమవుతాడు. వేద మహబీర్ను ఎలా ఆపగలిగాడు..? మిరాయి అంటే అర్ధం ఏమిటి? అతనికి ఈ గ్రంథాలను కాపాడే ఈ తెగలకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
దర్శకుడు ఈ కథను చందమామ, బాలమిత్ర కథలను మిక్స్ చేసుకొని తనదైన శైలిలో ఈ కథను రెడీ చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఈ లాజిక్ ను పక్కన పెట్టి చూడాల్సిందే. ఇక హాలీవుడ్ హ్యారీ పోటర్ సిరీస్ గుర్తుకు తెచ్చేలా తెరకెక్కించాడు. సినిమాలో పురాణ పాత్ర అయిన అగస్త్యు మహర్షి హీరోకు మిరాయ్ చేజిక్కించుకోవడంలో సాయం చేస్తాడు. శ్రీరాముడికి చెందిన మిరాయ్ ను సంపాతి అనే పక్షి ఎల్లవేళల హిమాయాలల్లో కాపాడుతూ ఉంటుంది. మొత్తంగా త్రేతా యుగానికి, కలియుగానికి మధ్య అనుసంధాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించాడు. మొదటి భాగంలో కథ కొంత అంచనా వేసేయగలిగేలా సాగుతుంది. హీరోయిన్ ఎదుటి వ్యక్తుల మెదడులో ఏముందో కనుగొనే అతీంత్ర శక్తులున్న పాత్రగా మలిచాడు. సినిమా ప్రారంభం నుంచి ఎక్కడా ప్రేక్షకులకు కన్య్యూజ్ చేయకుండా హీరో ఎవరనేది ప్రేక్షకులు తెలిసేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం బాగుంది. కానీ ప్రీ-ఇంటర్వెల్, వేద ఐడెంటిటీ రివీల్ సన్నివేశాలు కథకు కొత్త ఊపునిస్తాయి. రెండో భాగంలో మలుపులు ఆసక్తిని పెంచుతాయి. మహబీర్ పాత్రలో మనోజ్ ఇచ్చిన సౌండ్ బుక్ ట్రాక్, సిద్ధక్షేత్రం ఫైట్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే చివర్లో శ్రీరామ దర్శనం, సంపాతి పక్షి సన్నివేశాలు వంటి పురాణ ఘట్టాలు సినిమాకు గ్రాండియర్‌ని తెచ్చాయి. అంతేకాదు ప్రస్తుతం శ్రీరాముడి కోదండమే ‘మిరాయ్’గా దుష్ణ శిక్షణ శిష్ట రక్షణను వేదతో ఎలా చేయించిందనే పాయింట్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ తీసుంటే సినిమా మరో లెవల్లో ఉండేది. ముఖ్యంగా ఆధ్యాత్మికతను జానపద కథ జోడించి ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ప్రతి 10 నిమిషాలకు ఓ హైలెట్ సీన్ ఉంది. ఓ కథను అనుకోవడమే దాన్ని సరైన విధంగ తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. చివర్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టు చూపించాడు. మొత్తంగా చిన్న పిల్లలతో కలిసి ఈ సినిమాకు చూడొచ్చు.
టెక్నికల్ సిబ్బంది పనితీరు
గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఇచ్చిన సంగీతం థియేటర్‌ను హోరెత్తించింది.
కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని చూపిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా, హాలీవుడ్ స్థాయిలో అనిపించాయి.వీఎఫ్ఎక్స్ పనితనం బడ్జెట్‌ను దాటి నిలిచింది. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కట్టుదిట్టమైన ఎడిటింగ్‌తో కథను సాఫీగా నడిపాడు, అయితే కొన్ని సన్నివేశాలు కొంచెం పొడిగించబడినట్టుగా అనిపించాయి. నిర్మాణ విలువులు బాగున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అపుడు కార్తికేయతో కృష్ణుడు కాపాడితే.. ఇపుడు శ్రీరాముడు కాపాడనే చెప్పాలి.
నటీనటుల పర్ఫామెన్స్
తేజ సజ్జ తన నటనతో వేరియేషన్స్ చూపించాడు. కొన్ని సీన్స్ లో అద్భుతంగా మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో.. అలవోకగా కనిపించినా, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తనలోని శక్తిని బయటపెట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.మంచు మనోజ్ నిజంగా స్క్రీన్ మీద విలన్‌గా హడలగొట్టాడు. అతని డైలాగ్ డెలివరీ, కళ్ళలోని తీక్షణత పాత్రకు జీవం పోశాయి. శ్రియ శరణ్ పాత్ర బాగుంది. ఆమె ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఆకట్టుకుంది. హాస్యభరితంగా గెటప్ శ్రీను, అలాగే జగపతి బాబు, జయరామ్ తగిన స్థాయిలో రాణించారు. రితికా నాయక పాత్రకు మరింత బలాన్ని ఇస్తే బాగుండేది.
తీర్పు
మొత్తానికి మిరాయి ఒక ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. తేజ సజ్జ శక్తివంతమైన నటన, మంచు మనోజ్ విలన్‌గా దూకుడు, శ్రియా శరణ్ ఎమోషనల్ టచ్‌తో సినిమా రంజింపజేస్తుంది. విజువల్స్, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నా, కథ మొదటి భాగం సాదాసీదాగా ఉండడం, క్లైమాక్స్ బలహీనతగా మారాయి. అయినా కూడా థియేటర్లో చూడదగ్గ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ప్లస్ పాయింట్స్
కథ
విజువల్స్
సంపాతి సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ లాజిక్ సీన్స్
ఫస్టాఫ్ ల్యాగ్
పంచ్ లైన్.. ‘మిరాయ్’ ఓ విజువల్ ఎక్స్ పీరియన్స్.. అంతా రామమయం..
రేటింగ్: 3.25/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook