Mission Maya: టాలీవుడ్ పరిశ్రమలో ప్రతిభవంతులను ప్రోత్సహించే విధంగా పిజె ప్రొడక్షన్స్ వారి నిర్మాణ సంస్థ ద్వారా మరొక మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2గా ప్రవీణ్ జోల్లు నిర్మాణంలో ఖుషి రావు డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మాయ’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. తాజాగా ఈ చిత్ర పోస్టర్లు రవీంద్రభారతిలో డైలాగ్ కింగ్ సాయికుమార్, నటుడు ఆలీ, మామిడి హరికృష్ణ చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు అంతా కలిసి ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్లో తీయడం స్పెషాలిటీ. అయితే ఈ చిత్రానికి ఎక్కువగా ఆధునిక టెక్నాలజీ అయినటువంటి ఏఐ ను బాగా ఉపయోగించినట్టు చెప్పారు.
దర్శకుడు ఖుషి రావు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను చూసుకొని ఒక కొత్త ఐడియాతో సినిమా చేద్దామని వచ్చాను. ఈ సినిమాను పూర్తి ఐ ఫోన్ తో పాటు ఏఐ టెక్నాలజీతో రూపొందించడం విశేషం. పెట్టిన డబ్బులు వస్తాయో లేదో తెలియదు. చేసేది ఒక ఎక్స్పరిమెంట్ అని తెలిసి కూడా మాపై నమ్మకంతో ముందుకు వచ్చిన నిర్మాతగా ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. సాధారణంగా కొత్త టెక్నాలజీలు, విఎఫ్ఎక్స్ లు వచ్చినప్పుడు తెలుగువారు వాటిని ఉపయోగించి సినిమాలు తీయడంలో ఒక అడుగు ముందే ఉంటారు. ఈ చిత్రానికి ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగించారు. అలాగే చిత్ర టైటిల్ వెరైటీగా ఉందన్నారు.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
నిర్మాత ప్రవీణ్ జోల్లు మాట్లాడుతూ... "ఒక ఐఫోన్ లో షూట్ చేస్తూ టెక్నాలజీ ద్వారా ఒక చిత్రాన్ని చేద్దాం అనుకున్నాము. అంతవరకు ఓకే కానీ ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెరపై అది కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చేస్తూ ఉండగా దీనిపై పెట్టిన డబ్బు గాని లేదా ఇతర అంశాలు కానీ నాకు ఏమీ గుర్తురాలేదు. కేవలం వీరందరి కోసం ఈ మూవీ పూర్తి అవ్వాలి అని కోరుకున్నాను. అలాగే ఒక మొబైల్ ఫోన్లో అటువంటి అడవిలో ఒక సినిమా తీయడం అనేది దర్శకుడికి చాలా కష్టమైన పని. అయినా కూడా అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశారన్నారు.
సత్యనారాయణమాట్లాడుతూ... "మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఒక ఐఫోన్తో సినిమా చేద్దాం అనే ఆలోచన అనుకున్నాము. ఈ చిత్రం చాలా న్యాచురల్ గా రావాలని ఉద్దేశంతో నిజంగానే ఒక అడవిలోకి వెళ్లి షూటింగ్ చేసామన్నారు. దానితో నిర్మాత మా బాగోగులు రెగ్యులర్గా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉండేవారు. ఆయన మాకు కొండంత అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాలోని ప్రతి నటీనటులను ఆడిషన్ చేసి తీసుకున్నామంటూ ముగించామన్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









