HBD Mohan Babu : ప్రముఖ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్ బాబు గారు భారత సినిమా పరిశ్రమలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించారు. మార్చ్ 19, 1952లో జన్మించిన ఆయన ఈ ఏడాది 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మహాదేవశాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు.
1975 నుంచి 1990 వరకు మోహన్ బాబు గారు ప్రతినాయక పాత్రల్లో సరికొత్త ఒరవడిని సృష్టించారు. ‘స్వర్గం నరకం’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టినా, విలన్ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 1990లలో హీరోగా మారి ‘అల్లుడు గారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో గొప్ప విజయాలు సాధించారు. ‘పెదరాయుడు’ 200 రోజులు పూర్తి చేసుకున్న వేడుకను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్యంగా అప్పట్లో ఆయన సినిమాలు కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసేవి. పెదరాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలబడి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ లాంటి చిత్రాలను కూడా ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. హీరో గానే కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలలో ఇప్పటికీ అలరిస్తున్నారు ఈ నటుడు.
1992లో ప్రారంభించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. 2022లో మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్య రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు.
తన విభిన్నమైన నటనకు గుర్తింపుగా 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించగా, 2016లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
ప్రస్తుతం మోహన్ బాబు..తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మహాదేవశాస్త్రి పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న మోహన్ బాబు గారు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా 75కి పైగా సినిమాలను నిర్మించారు. ఆయన సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిస్తుంది.
Also read: Sunitha Williams: 286 రోజుల తర్వాత భూమి మీదకు సురక్షితంగా సునీత.. ఇప్పుడు ఎలా ఉందో వీడియో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









