Mohan Babu - Kannappa: టాలీవుడ్ పెద్దరాయుడు డాక్టర్ మోహన్ బాబు 79వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈయన బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి ‘మహదేవ శాస్త్రి’ పరిచయ గీతానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహాదేవ శాస్త్రి పాత్ర కోసం మోహన్ బాబు ఎలా మేకోవర్ అయ్యారు? షూటింగ్ ఎలా జరిగింది? ఆ పాత్ర కోసం పడిన కష్టం ఏమిటనేది ఈ గ్లింప్స్ లో చూపించారు. ఈ గ్లింప్స్‌లో సుద్దాల అశోక్ తేజ రాసిన గీతం బాగుంది. ఇక శంకర్ మహదేవన్ పాట పాడిన విధానం ఆకట్టుకుంది. స్టీఫెన్ దేవస్సీ బాణీ అద్భుతంగా ఉంది. మహదేవ శాస్త్రి ఔనత్యాన్ని తెలియజేసేలా ఈ పాట ఉంది. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్లు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్నప్పగా కనిపించబోతున్నారు. అలాగే మోహన్ బాబు మనవడు.. మంచు విష్ణు తనయుడు అవ్రామ్ భక్త ఈ సినిమాలో బాల కన్నప్ప పాత్రలో కనిపంచనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. రుద్రగా కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరోగా అక్షయ్ కుమార్ మహదేవుడి పాత్రలో కనిపించున్నారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కిరాతకుడి పాత్రలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ పార్వతి మాత పాత్రలో కనిపింనుంది. ఇప్పటికే ఆయా నటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే కన్నప్ప ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ రెడీగా ఉంది.
మోహన్ బాబు ‘కన్నప్ప’తో పాటు మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తూన్న ‘దక్ష’లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు ఎంటర్ టైన్మెంట్,శ్రీ లక్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై డాక్టర్ మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్ననిర్మిస్తున్నారు. అంతేకాదు సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









