Mohan babu shocking comments on kannappa movie: మోహన్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. ఇటీవల మోహన్ బాబు తరచుగా వార్తలలో ఉంటున్నారు. గతేడాది మంచు మనోజ్, మంచు మోహన్ బాబుల ఆస్తుల వివాదాలు తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. అదే విధంగా.. దీనిపై మంచు మోహన్, మనోజ్ లు ఇద్దరు ఒకరిపై మరోకరు పోలీస్ స్టేషన్ లలో కేసుల్ని నమోదుచేసుకున్నారు. ఇంకా జల్ పల్లి వద్ద జరిగిన ఘటనలో మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు.అది పీక్స్ కు చేరింది.
ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి మోహన్ బాబు బెయిల్ తెచ్చుకొవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై మాట్లాడారు. కొంత మంది ప్రతి విషయాన్ని ట్రోలింగ్ చేస్తున్నారని, దాని వల్ల వాళ్లకు వచ్చేది ఏంటో అర్థంకావట్లేదన్నారు. కన్నప్పను కూడా చాలా మంది ట్రోల్స్ చేశారని.... కానీ అంతిమంగా మూవీని ఆదరించాల్సింది అభిమానులని.. ప్రజలే సినిమాను నచ్చితే ఆదరిస్తారని అన్నారు. తాను ఇప్పటి వరకు 560 సినిమాలు తీశానన్నారు.
కొన్నిసినిమాలు హిట్ సాధించకపోతే ట్రోల్స్ చేయడంఏంటని మండిపడ్డారు. సినిమా ఫెల్ కావడం, నటుడిగా ఫెల్ కావడం మధ్యంలో చాలా తేడాఉందన్నారు. అదే విధంగా గతంలో తాను..తొలిసారి రాజమకుటం సినిమా చూసినట్లు చెప్పారు. దాసరి నారాయణ రావు తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. 1975 లో స్వర్గం, నరకం, సినిమాలో విలన్ గా చేశానన్నారు.
Read more: Pawan Kalyan: భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్..?.. కారణం ఏంటో తెలుసా..?
ఆ తర్వాత, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రతిజ్ఞ బ్యానర్ మీద మేజర్ చంద్రకాంత్ మూవీ తీసినట్లుచెప్పారు. ఈ సినిమా కోసం తన ఆస్తులు సైతం అమ్ముకున్నట్లు చెప్పారు. అయితే.. తనకు కెరియర్ లో చాలా మంది మోసం చేశారని..కానీ నేను మాత్రం అవేమి పట్టించుకోలేదన్నారు. ఒకరి చెడుకోరుకుంటే.. మనకే చెడు అవుతుందన్నారు. అందరి మంచిని కోరుకునే వారు నిజమైన వ్యక్తిత్వం ఉన్నవారని కూడా మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









