
Mohanlal - 1000 Kotlu: భారత దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్ కు సెపరేట్ ప్లేస్ ఉంది. ఈ గురువారం మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్ 2- ఎంపురాన్’ మూవీతో పలకరించబోతున్నారు. తాజాగా ఈయన హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "1000 కోట్లు. గతంలో "100 కోట్లు"వంటి మూవీని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం "1000 కోట్లు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ"
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో ‘1000 కోట్లు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ కథానాయికగా నటించింది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం డెఫినెట్ గా విజయం సాధించి మోహన్ లాల్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు సాధించే హీరోగా నిలబడాలని మేము కోరుకుంటున్నామన్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కావ్య మాధవన్, నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాతీష్ వేగ సంగీతం అందించారు. ప్రదీప్ నాయర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి అందించారు. జోషి డైరెక్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe