Mohanlal Apology: 'నన్ను బాధించాయి.. క్షమించండి'.. అభ్యంతరాలపై మోహన్‌లాల్‌ క్షమాపణలు

Mohanlal Breaks Silence And Apologised: మంచి హిట్‌ టాక్‌తోపాటు వివాదంతో దూసుకెళ్తున్న ఎంపురాన్‌ సినిమాకు సంబంధించిన ఆ చిత్ర నటుడు మోహన్‌ లాల్‌ క్షమాపణలు కోరాడు. తనను క్షమించాలని ప్రకటన జారీ చేశాడు. ఎందుకు? ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 30, 2025, 05:26 PM IST
Mohanlal Apology: 'నన్ను బాధించాయి.. క్షమించండి'.. అభ్యంతరాలపై మోహన్‌లాల్‌ క్షమాపణలు

Mohanlal Apology: మలయాళంలో రూపుదిద్దుకున్న ఎంపురాన్‌-2 సినిమా దక్షిణాది భాషల్లో విడుదలైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌ లాల్‌ నటించిన ఎంపురాన్‌ 2 సినిమా మార్చి 27వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. హిట్‌ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమా కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదల రోజు నుంచి వివాదం రాజుకుంది. ఈ సినిమా రాజకీయ వివాదానికి కూడా దారి తీయడంతో మరింత రచ్చగా మారింది. ఈ వ్యవహారంపై తొలిసారిగా మోహన్‌ లాల్‌ నోరు విప్పాడు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించాడు.

Add Zee News as a Preferred Source

Also Read: Sikandar Movie Leak: సల్మాన్‌ ఖాన్‌కు 'పైరసీ' దెబ్బ.. ఇంటర్‌నెట్‌లో సికిందర్‌ సినిమా లీక్‌

'రాజకీయం.. సామాజిక అంశాలు ఎంపురాన్‌ సినిమాలో భాగమయ్యాయి. నాకు ప్రియమైన వారిలో కొందరినీ అవి బాధించాయి. నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని.. భావజాలాన్ని.. ఏ వర్గాన్ని కించపరకుండా చూడడం నటుడిగా నా బాధ్యత. ఈ కారణంగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు కోరుతున్నా' అని మోహన్‌ లాల్‌ ప్రకటన చేశారు. వివాదానికి కారణమైన సంబంధిత సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 40 ఏళ్లుగా మీలో ఒకడిగా ఉంటున్నానని.. మీ ప్రేమ.. నమ్మకమే తన బలం అని మోహన్‌ లాల్‌ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Also Read": Kannappa Movie: అభిమానులకు షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. కన్నప్ప సినిమా వాయిదా

వివాదం ఏమిటి?
ఎంపురాన్‌ 2 సినిమాలో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లను ప్రస్తావిస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. 2002లో జరిగిన అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొన్నాళ్లకు అతడు రాజకీయాల్లోకి రావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయని కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదపై నిర్మాత గోకులం గోపాలన్‌ కూడా స్పందించారు.

ఇక ఎంపురాన్‌ 2 సినిమా వివాదంపై చిత్రబృందానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మద్దతు ప్రకటించారు. ఈ సినిమాను కుటుంబంతో సహా చూశారు. అనంతరం భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలని సీఎం విజయన్‌ పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News