)
Mohanlal Dada Saheb Phalke Award: సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను వరించింది. చిత్రసీమకు ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించనుంది. ఇదే విషయాన్ని శనివారం సాయంత్రం కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలియజేస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2023 సంవత్సరానికి గానూ ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ ను వరించింది.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ చలన చిత్రరంగానికి ఎంతో ఆదర్శవంతమైన సేవలను మోహన్ లాల్ అందించారని మోదీ సర్కార్ పేర్కొంది. ఆయన ఎంతో అద్భుత ప్రతిభ, కృషి, వైవిధ్యం, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని ప్రశంసించింది. సెప్టెంబరు 23న ఢిల్లీ వేదికగా జరగనున్న 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.
చిత్రసీమలో అవార్డుల రారాజు..
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇప్పటివరకూ మొత్తం 6 సార్లు జాతీయ పురస్కారాలను గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా రెండు సార్లు, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విభాగాల్లో నాలుగు సార్లు అవార్డు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా నిర్మాతగా 'వానప్రస్థానం' చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందిపుచ్చుకున్నారు మోహన్ లాల్.
జాతీయ పురస్కారాలే కాకుండా మోహన్ లాల్‌కు అనేక కేరళ స్టేట్ అవార్డ్స్ లభించాయి. దీంతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ ఆయనకు కొత్తేమి కాదు. మోహన్ లాల్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ఇప్పటికే పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం సత్కరించింది. తాజాగా ఆయన్ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించి ఆయన గౌరవాన్ని మరింతగా పెంచేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు..
మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఎంపికవ్వడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, నటులు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అభినయంతో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడని.. విభిన్న పాత్రలు పోషించి ఐదు జాతీయ అవార్డులను గెలుచుకున్నారని పవన్ అన్నారు. తెలుగులో నటించిన కొన్ని చిత్రాలైనా డబ్బింగ్ చిత్రాలతో మోహన్ లాల్ తెలుగు వారికి మరింత దగ్గరయ్యారని ప్రశంసించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook