Barroz: మోహన్ లాల్ కు ఘోర అవమానం.. కనీసం పోస్టర్ ఖర్చులు రాబట్టని బిగ్ ప్యాన్ ఇండియా మూవీ..

Barroz Box Office collections: అవమానం.. ఘోర అవమానం.. జాతీయ ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ కు ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు. అవును తాజాగా ఈయన హీరోగా బరోజ్ సినిమాకు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేకపోవడంతో ఆయన అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2025, 12:57 PM IST
Barroz: మోహన్ లాల్ కు ఘోర అవమానం.. కనీసం పోస్టర్ ఖర్చులు రాబట్టని బిగ్ ప్యాన్ ఇండియా మూవీ..

Barroz Box Office collections: ఒక్కో హీరోకు తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయో.. అంతకంటే ఘోరమైన ఫ్లాప్స్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి. ఇక మోహన్ లాల్ కూడా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం సహా అన్ని భాషల్లో నటించి నిజమైన ప్యాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన మెగాఫోన్ పట్టుకొని ‘బరోజ్’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తూ నటించారు. ఈ సినిమాలో ఆయన ఓ దెయ్యం పాత్రలో నటించారు. పూర్తి 3D లో తెరకెక్కిన ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో గతేడాది చివర్లో డిసెంబర్ 25న  రిలీజ్ చేశారు. దాదాపు రూ. 150 కోట్ల భారీ ఖర్చుతో మలయాళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమా కనీసం పోస్టర్ ఖర్చులను తెలుగులో రాబట్టలేకపోయింది. తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ తో అసలు కోలుకోలేకపోయింది.

Add Zee News as a Preferred Source

ఈ సినిమా తెలుగులో రూ. 25 లక్షల షేర్.. రూ. 55 లక్షల గ్రాస్ సొంతం చేసుకొని మోహన్ లాల్ కు ఘోర పరాభవాన్ని మిగుల్చింది. తెలుగులో ఈ సినిమా రూ. 2 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ చేసినా.. ఆ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక కేరళలో ఈ సినిమా మొత్తంగా రూ. 10.20 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ సొంతం చేసుకుంంది. రెస్ట్ ఆఫ్ భారత్ లో రూ. 1 కోటి లోపే గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో రూ. 4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. టోటల్ రన్ లో ఈ సినిమా రూ. 7.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. అంతేకాదు రూ. 16.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగుల్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా అంతగా రాబట్టలేకపోయింది. ఓవరాల్ గా మలయాళ సినీ ఇండస్ట్రీ పరంగా ఈ సినిమా భారీ నష్టాలను మిగుల్చింది. అంతేకాదు హీరోగా మోహన్ లాల్ స్టార్ డమ్ ను ప్రశ్నార్ధాకం చేశాయి. మోహన్ లాల్ ప్రస్తుతం ‘లూసీఫర్’ మూవీకి ప్రీక్వెల్ గా ఎల్ 2 ఎంపురాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న భారీ ఎత్తున ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News