Lucifer 2 - Empuraan collections: మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎంపురాన్’. పృథ్వీరాజ్ సుకుమార్ మరో కథానాయకుడిగా నటించడంతో పాటు ఆయన దర్శకత్వం వహించారు. అయితే.. ఈ సినిమా హిందూ మెజారిటీ వర్గాన్ని దోషిగా చూపిస్తూ తెరకెక్కించడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ హిందూ నాయకుడు ఇతర మతస్తులపై చేసిన దాష్టీకం. ఆ తర్వాత అతనిపై ప్రతీకారం తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ ఈ సినిమా స్టోరీ. ముఖ్యంగా 2002లో గుజరాత్ లో జరిగిన మత ఘర్షణలను ఓ కోణంలోనే చూపించారనే నేపథ్యంలో ఈ సినిమాపై వివాదాం మొదలైంది. దీనిపై ఈ చిత్ర హీరో మోహన్ లాల్ ఓ మెట్టు దిగొచ్చి ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. ఈ సినిమాకు మలయాలంలో స్టార్ క్యాస్ట్ వలన మంచి వసూళ్లే దక్కినా.. మిగతా భాషల్లో కనీస వసూళ్లను రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాకు ఇంత బ్యాడ్ టాక్ తోనే మలయాళంలో దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఈ చిత్రానికి వచ్చిన వసూల్లు అన్ని ఫేక్ అని చెబుతున్నారు. నిర్మాతలు తమ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసమే ఈ సినిమాకు అత్యధిక వసూల్లు రాబట్టినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు.. నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేసారు. ముఖ్యంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చాయి. అక్కడ నుంచి బ్లాక్ మనీని వైట్ గా మార్చినట్టు ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. గతంలో ముమ్ముట్టి నిర్మాతగా నిర్మించిన ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమాకు కూడా వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువగా చూపించారు. అప్పట్లో ఈడీ రంగంలోకి దిగి ఈ ఫేక్ కలెక్షన్స్ గుట్టు రట్టు చేసింది. ఇపుడు మోహన్ లాల్ ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకుంటున్న ‘ఎంపురాన్’ మూవీ అసలు కలెక్షన్స్ రూ. 120 కోట్ల గ్రాస్ కూడా దాటలేదని చెబుతున్నారు. కానీ నిర్మాతలు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు లెక్కలు చూపిస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతనేది కేంద్ర ఏజెన్సీలు తేల్చనున్నాయి.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









