)
Movie Ticket GST Percentage: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల GST రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, కొత్త స్లాబ్‌లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించారు. అనేక వస్తువులపై ఉన్న పన్ను స్లాబ్‌లను సవరించారు. రాబోయే సెప్టెంబరు 22 తేదీ నుంచి 5%, 18% కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో సినిమా టికెట్లపై కూడా ఈ మార్పు రానుంది. గతంలో 12% పన్ను విధించిన రూ.100 లేదా అంతకంటే తక్కువ ధర గల టిక్కెట్లు ఇప్పుడు 5% తక్కువ GST రేటుతో వర్తిస్తుంది. అయితే రూ.100 కంటే ఎక్కువ ధర గల టిక్కెట్లపై GST మునుపటిలాగే 18% ఉంటుంది.
సినిమా టిక్కెట్లపై 5% GST
వస్తు సేవల పన్ను (GST) కౌన్సిల్ అనేక విషయాలపై పన్ను శ్లాబులను సవరించింది. 5%, 18% కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి తేనుంది. అటువంటి పరిస్థితిలో సింగిల్ స్క్రీన్, చిన్న నగరాల్లో సినిమా టిక్కెట్లను కొనుగోలు చేయడం మరింత చౌకగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త GST నిబంధనల ప్రకారం, రూ. 100 లేదా అంతకంటే తక్కువ ధర గల టిక్కెట్లపై 12% రేటుతో 5% ITCతో GST విధిస్తున్నారు.
ప్రయోజనం ఏమిటి
తక్కువ ధర గల టిక్కెట్లపై 7% పన్ను తగ్గింపు దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు చూడటం చౌకగా చేస్తుంది. ఇది వ్యాపారాన్ని పెంచుతుంది. ఎక్కువ మంది థియేటర్లకు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇది నిర్మాతలకు మాత్రమే కాకుండా పంపిణీదారుల నుండి ప్రదర్శకుల వరకు అందరికీ ప్రయోజనం కలగనుంది.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థన
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రభుత్వాన్ని రూ. 300 వరకు ధర ఉన్న సినిమా టిక్కెట్లను 5% స్లాబ్ కిందకు తీసుకురావాలని అభ్యర్థించింది. ఎందుకంటే ఈ చర్య సినిమాలను మరింత ధరలను తగ్గించినట్లు అవుతుంది. దీంతో నగరాలు, పట్టణాల్లోని థియేటర్లను పెంచేందుకు సహకరించడం సహా ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook