Mowgli Rating :
కథ
మురళీకృష్ణ(రోషన్ కనకాల) అనే యువకుడు అనాథగా పెరుగుతారు. అడవిలో పెరిగిన అతడిని అందరూ మోగ్లీ అని పిలుస్తారు. అతడికి ఎస్సై కావాలనే కల ఉంటుంది. అడవికి వచ్చే సినిమా టీమ్స్‌కు సహాయం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే సమయంలో ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా డూప్ ఆర్టిస్ట్‌గా పనిచేసే అవకాశం వస్తుంది.
ఆ షూటింగ్‌లో పనిచేసే డ్యాన్సర్ జాస్మిన్‌తో.. మోగ్లీకి పరిచయం అవుతుంది. జాస్మిన్ కి వినిపియ్యదు.. మాట్లాడలేదు... మాటలు లేకపోయినా.. జాస్మిన్, మురళీకృష్ణ మధ్య భావాలు.. ప్రేమగా మారుతాయి. మోగ్లీ తనను రాముడిగా, జాస్మిన్‌ను సీతగా ఊహించుకుంటాడు. ఈ ప్రేమ కథలోకి పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ అడుగుపెడతాడు. అతడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జాస్మిన్‌ను తన అవసరాలకు ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. మోగ్లీ తన ప్రేమను కాపాడుకోగలిగాడా? కర్మ సిద్ధాంతం ఈ కథలో ఎలా పనిచేసింది? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల నటన
రోషన్ కనకాల ఈ సినిమాలో చాలా మెచ్యూర్‌గా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా సులువుగా నటించాడు. హీరోయిన్ సాక్షి మడోల్కర్ మాటలు లేకుండా కేవలం భావాలతో నటించడం ప్రశంసించాలి. విలన్‌గా బండి సరోజ్ కుమార్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
సాంకేతిక అంశాలు
అడవిలో చిత్రీకరించిన దృశ్యాలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సంగీతం కథకు తగ్గట్టే ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉండింటే బాగుండేది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించినా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.
విశ్లేషణ
ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు. అడవి నేపథ్యం, రామాయణ పాత్రల పోలికలు.. కర్మ సిద్ధాంతాన్ని కలిపి దర్శకుడు కథను చెప్పే ప్రయత్నం చేశాడు. రాముడు–సీత–రావణుడు అనే భావనలను ఆధునిక కథలో చూపించారు. కొన్ని చోట్ల ఇది బాగా పనిచేసింది.మొదటి భాగం నెమ్మదిగా సాగినా పాత్రల పరిచయానికి ఉపయోగపడుతుంది. ప్రేమ సన్నివేశాలు భావోద్వేగంగా ఉంటాయి. విలన్ పాత్ర బలంగా కనిపిస్తుంది.. అయితే కొన్నిచోట్ల అతిగా అనిపించే సీన్లు కూడా ఉన్నాయి. మరి ఒక మనిషిలో అంత విలనిజం చూపించాల్సిన అవసరం కూడా లేదేమో అనిపించక మానదు.
ముఖ్యంగా ఈ దర్శకుడు గతంలో తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమాలో మెయిన్ హైలైట్ క్లైమాక్స్ అలానే ఎమోషన్స్. ఆ రెండు కూడా ఈ సినిమాలో కొద్దిగా తగ్గాయేమో అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా మందికి కనక్ట్ అవ్వచ్చు.
తుది మాట
మోగ్లీ ఒక ఫారెస్ట్ లవ్ స్టోరీ. రామాయణ భావాలు..కర్మ సిద్ధాంతాన్ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. భావోద్వేగాలు.. ప్రేమ.. ధర్మం అనే అంశాలతో సాగే సినిమా ఇది. కొత్త ప్రయత్నాలను ఆదరించే ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: నేడు మెస్సీ మ్యాచ్ ట్రాఫిక్ ఆంక్షలు..! టిక్కెట్ లేనివారు స్టేడియం పరిసరాల్లోకి రావద్దు..!
ఇదీ చదవండి: మెస్సీ మాయలో భారత్.. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









