Mr Reddy Teaser Launch Event: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న గోల్డ్ మ్యాన్ రాజా ‘మిస్టర్ రెడ్డి’ టీజర్..

Mr Reddy Teaser Launch Event: టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారావు-టీఎన్ఆర్) హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ మూవీకి వెంకట్ వోలాద్రి డైరెక్ట్ చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లో జరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 6, 2025, 03:37 PM IST
Mr Reddy Teaser Launch Event: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న గోల్డ్ మ్యాన్ రాజా  ‘మిస్టర్ రెడ్డి’ టీజర్..

Mr Reddy Teaser Launch Event: టి.నరసింహారావు  ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’ ఈ చిత్రంలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి  దీప్తి, భాస్కర్ లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ టీజర్‌లోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. బాల్యంలో విడిపోయిన ప్రేమ జంట.. పెద్దయ్యాక మళ్లీ ఎదురు పడితే.. మళ్లీ ఆ లవ్  కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే  కాన్సెప్ట్‌తో మిస్టర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు.  టీజర్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంది. ‘మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు అనే డైలాగ్స్ బాగున్నాయి.  జీవితాన్ని చివరి వరకు కలిసి పంచుకోవడం వంటి చెప్పే డైలాగ్ ఈ చిత్రానికి  కాన్సెప్ట్ ఏంటో చెప్పకనే చెప్పేసింది.

Add Zee News as a Preferred Source

టీజర్ లాంచ్ ఈవెంట్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్ వంటి వారు ఛీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. టీజర్ లాంచ్ అనంతరం..స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి టీం చాలా ఎనర్జీతో కనిపిస్తోంది. డైరెక్టర్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. హీరో, నిర్మాత నరసింహా రెడ్డి చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు.  మిస్టర్ రెడ్డి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.  

పట్నం సునీతా రెడ్డి మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి లాంటి చిత్రాలు సక్సెస్ అయితేనే సినీ ఇండస్ట్రీ కళకళలాడుతుందన్నారు.  ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలన్నారు.  చిన్న చిత్రాలే ఇప్పుడు ఎక్కువగా విజయాన్ని అందుకుంటున్నాయి. మిస్టర్ రెడ్డి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాన్నారు.

నల్లగొండ గద్దర్ మాట్లాడుతూ .. ‘ఈవెంట్‌కు వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కి, సునీత కి ప్రత్యేక కృతజ్ఞతలు. హీరో, నిర్మాత నరసింహారెడ్డి నాకు చిన్నతనం నుంచీ పరిచయం  ఉంది. మొదటి నుంచీ ఈయన చాలా వేగంగా దూసుకుపోతూనే ఉంటున్నారు. రంగారెడ్డి నుంచి హీరోగా, నిర్మాతగా ఎదగడం చూస్తే హ్యాపీగా ఉందన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.             

హీరో గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్ లుగా విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నకి, సునీత అక్కకి, నల్లగొండ గద్దర్ అన్నకి ధన్యవాదాలు తెలిపారు. మా టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కొత్త వాళ్లమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరారు. మా సినిమా త్వరలోనే రాబోతోంది. అందరికి తప్పకుండా నచ్చతుందన్నారు. స

దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ .. ‘కొత్త వాళ్లమంతా కలిసి ఈ చిన్న ప్రయత్నం చేశామన్నారు. మిస్టర్ రెడ్డి సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను మేం అంతా చాలా కష్టపడి చేశాము. మా లాంటి కొత్త వారు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను.

మహాదేవ్ మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి సినిమా షూటింగ్ టైంలో ఎంతో నేర్చుకున్నాను. ఇంత మంచి టీంతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటునన్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News