AR Rehman: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు తీవ్ర అస్వస్థత..

AR Rehman: భారత దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహామాన్ కు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 16, 2025, 11:52 AM IST
AR Rehman: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు తీవ్ర అస్వస్థత..

AR Rehman: సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థతకు గురయ్యారు. నిన్న లండన్ నుంచి  చెన్నైకి తిరిగి వస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురైన రెహమాన్ వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం రెహ్మాన్ కు చికిత్స అందిస్తున్న కార్డియాలజీ విభాగం డాక్టర్లు. అయితే వైద్యులు మాత్రం AR రెహమాన్ ఆరోగ్యం నిలకడనే ఉందన్నారు.  ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న ఆసుపత్రి వర్గాలు..

Add Zee News as a Preferred Source

తీవ్ర ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఏ.ఆర్.రెహమాన్. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6  చెన్నైలో జన్మించారు. జన్మత:  దిలీప్ గా హిందువుగా పుట్టిన ఏఆర్ రెహమాన్ ఆ తర్వాత ముస్లిమ్ గా మతం మార్చుకొని తన పేరును అల్లా రఖా రెహమాన్ గా పేరు మార్చుకున్నారు.  1989 లో ఫ్యామిలీతో పాటు ఇస్లాం మతం స్వీకరించాడు రెహమాన్. చెల్లెలి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్నాడు. అతని కోరిక నెరవేరడంతో ముస్లిం మతంపై  విశ్వాసం పెరిగింది. కుటుంబంలోని అందరి పేర్లు మారిపోయాయి.

రెహమాన్ విషయానికొస్తే.. ఈయన  చెన్నైలో పుట్టి పెరిగాడు. రెహమాన్ మొదటి పేరు.. దిలీప్ కుమార్. తండ్రి ఆర్.కె.శేఖర్ కూడా మ్యూజిక్ కంపోజరే. తమిళ్, మలయాళి చిత్రాలకు కంపోజ్ చేసేవాడు. అతనితో పాటు రెహమాన్ కూడా రికార్డింగ్స్ కు వెళ్లేవాడు. కీబోర్డ్ ప్లే చేయడం చిన్నపుడే నేర్చుకున్నాడు.  రెహమాన్ కు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి మరణించాడు. తల్లి కస్తూరి కుటుంబాన్ని పోషించేది. ఇంట్లో మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్లను అద్దెకు ఇచ్చి కొన్నాళ్లపాటు జీవనం సాగించారు. ఆ రోజుల్లోనే రెహమాన్ చిన్నప్పటి ఫ్రెండ్స్ శివమణి, జాన్ ఆంథోని, సురేశ్ పీటర్స్, జొజొ, రాజాలతో కలిసి రూట్స్ అనే రాక్ బ్యాండ్స్ గ్రూప్ ని ఫామ్ చేసాడు. రెహమాన్ నెమెసిస్ అవెన్యూ అనే చెన్నై బేస్డ్ రాక్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసాడు.

1992లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోజా’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాదు 'స్లమ్ డాగ్ మిలీయనీర్’ మూవీతో ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇక కేంద్రం నుంచి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. తమిళ సినిమాతో కంపోజింగ్ స్టార్ట్ చేసిన రెహమాన్ 1995 లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడా ఫస్ట్ చాన్స్ తోనే సెన్సేషన్. హోల్ ఇండియన్ ఇండస్ట్రీ టాక్ గా మారిపోయాడు రెహమాన్. తెలుగులో కూడా 20 కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News