KORAGAJJA Movie: కాంతారా మూవీని మించి 'కొరగజ్జ'.. అందుకే ఆలస్యం

KORAGAJJA Movie: కాంతారా మూవీ కంటే కొరగజ్జ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ఈ సినిమాతో తనకు కొత్త ప్రయోగాలు చేసే అవకాశం వచ్చిందని.. ఎంతో సవాలుగా అనిపించిందని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 24, 2025, 11:04 PM IST
KORAGAJJA Movie: కాంతారా మూవీని మించి 'కొరగజ్జ'.. అందుకే ఆలస్యం

KORAGAJJA Movie: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కొరగజ్జ. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో.. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో పూజించే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. సుధీర్ అత్తవర్‌తో కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం ఓ ప్రత్యేకం అనుభవమని చెబుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ఈ మూవీతో తాను సంగీతంలో సరికొత్త ప్రయోగాలను చేశానని అన్నారు. మీడియాతో ముచ్చటిస్తూ.. తన ఈ సినిమాకు తన అనుభవాన్ని గురించి పంచుకున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయాడానికి చాలా రీసెర్చ్ చేశామన్నారు. సంగీతంలో కొత్త ప్రయోగాలను చేయాల్సి వచ్చిందని.. గత చరిత్రను తెలుసుకున్నామన్నారు. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టిందని.. అనాటి ఆచారాలను అర్థం చేసుకున్న తరువాత తనకు ట్యూన్స్ వచ్చాయన్నారు. డైరెక్టర్‌కు తన పని నచ్చినందుకు.. సంగీతం నచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి.. కొత్త శైలిని తనకు వీలు కల్పించిందని.. ఎంతో సవాలుగా అనిపించిందన్నారు.

ఈ సినిమాలో ఆరు సాంగ్స్‌ ఉంటాయని.. వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచిన్నట్లు చెప్పుకొచ్చారు గోపీ సుందర్. సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారని.. శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి టాలెంటెడ్ సింగర్స్ పాటలు పాడారని తెలిపారు. కాంతార మూవీ కంటే ఎంతో భిన్నంగా ఉంటుందన్నారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో కాంతార ఒకరిని మాత్రమే చూపించిందని గుర్తు చేశారు. ఈ సినిమాపై EP శ్రీ విద్యాధర్ శెట్టి సహాయంతో దర్శకుడు సుధీర్ అత్తవర్ పరిశోధన చేశారని అన్నారు. 

కాంతార మూవీ తరువాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ వివిధ భాషల్లో విడుదల కానుంది. కబీర్ బేడి, ప్రముఖ కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, దక్షిణాది అగ్రనటులు భవ్య, శ్రుతితోపాటు ఇంకా ఎంతో స్టార్ నటీనటులు నటించారు. మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రఫర్‌గా పనిచేయగా.. జిత్ జోషి, విద్యాధర్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. బిబిన్ దేవ్ సౌండ్ డిజైనింగ్, డీఐ కలరిస్ట్ లిజు ప్రభాకరన్ డీఐ, లవన్-కుషన్ విఎఫ్ఎక్స్ & గ్రాఫిక్స్ వంటి అసాధారణ టెక్నికల్ టీమ్ ఈ సినిమా కోసం పని చేసింది. ఈ సినమా ఆడియో రైట్స్ కోసం భారీ రేటుని చెల్లించేందుకు పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: 8th Pay Commission: మరో 2 వారాల్లో 8వ వేతన సంఘం, జీతాలు ఎంత పెరుగుతాయంటే

Also Read: Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News